బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్… మన తెలుగులో కూడా సక్సెస్ అయింది. బిగ్ బాస్ గత సీజన్ లో ఫెయిల్ అయింది అనే కామెంట్స్ నేపధ్యంలో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారు. కాని షో నుంచి కొందరు ఎలిమినేట కావడం కాస్త వివాదాస్పదం అవుతోంది. చివరి వరకు ఉంటారు అనుకున్న వాళ్ళు మధ్యలోనే ఎలిమినేట్ కావడం పట్ల విమర్శలు వస్తున్నాయి. గతంలో కంటే ఈ సీజన్ అంతా కన్ఫ్యూజన్ తో నడుస్తోంది అనే ఆరోపణలు ఉన్నాయి. షో చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. వైల్డ్ కార్డ్ పేరుతో చాలా మందిని తీసుకొచ్చారు లోపలికి.
తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగార్జున తనతో తప్పు మాట్లాడారని.. థర్డ్ వీక్‌లో నేను అలిగానని అన్నారని… అది చాలా రాంగ్ అని కొట్టిపారేసింది. హోస్ట్ గా ఆయన చేసింది చాలా తప్పు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. వాడెవడో పెట్టలేదని, తినమని అడగలేదని నేనెందుకు అలుగుతా అంటూ ఆమె ప్రశ్నించింది. అది కూడా తప్పే అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. యష్మీ విషయంలో కూడా నన్నే రాంగ్గా చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. అడల్ట్ రేటెడ్ కామెడీతో అన్నదానితో లింక్ చేశారని ఫైర్ అయింది.
అది కూడా తప్పే అని… నిఖిల్‌ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని అన్నారని… అది కూడా తప్పే అంటూ ఆమె మండిపడింది. మిస్ ఫైర్ అయ్యిందని నిఖిల్ అంటే.. ఏ మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాగార్జున సార్ తప్పు మాట్లాడారని… లేదు సార్.. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని వివరణ ఇచ్చిన తరువాత కూడా.. ఆయన ఏం చెప్పాలని అనుకున్నారో.. నాకు అర్థమైపోయింది అంటూ… నన్ను రాంగ్ వేలో చూపిస్తున్నారని నాకు క్లారిటీ వచ్చేసిందని ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నేను విష్ణుని ఏ డిస్కషన్లో అడల్ట్ రేటెడ్ కామెడీ అని అన్నానో.. దాన్ని తీసుకొచ్చి యష్మీ ఇష్యూతో లింక్ చేశారని షోపై ఫైర్ అయింది.
అది టోటల్ రాంగ్ అని క్లారిటీ ఇచ్చింది. విష్ణుకి నేను క్షమాపణ చెప్పా.. దాన్ని కూడా చూపించలేదని… నీకు నచ్చినట్టు చూపించడానికి నేను ఇక్కడికి రాలేదు అంటూ ఆమె కామెంట్స్ చెప్పడం గమనార్హం. నా రియాలిటీ ఏంటో చూపించడానికి వచ్చానని తెలిపింది. నా వ్యాల్యూస్‌ని డౌన్ చేస్తే నేను తీసుకోలేనని… నాగ్ సార్ ఇలా అన్నప్పుడు నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు… ఎందుకంటే.. ఒక వారం ఇస్తా.. ప్రతి వారం ఇదే రిపీట్ చేస్తున్నారని చెప్తూ… వాళ్లు నన్ను ఎలా చూపించాలని అనుకుంటున్నారో.. నాగార్జున సార్ మాటల్ని బట్టి తెలిసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. నా విలువని తగ్గిస్తే నేను అస్సలు సహించనని తెలిపింది. అందుకే నా అంతట నేను బయటకు వచ్చేశానని… వాళ్లు ఎలిమినేట్ చేస్తే నేను రాలేదని క్లారిటీ ఇచ్చింది. వాళ్లు నన్ను పంపకపోతే నేను ఎంతకైనా తెగిస్తానని భయపడి నన్ను బయటకు పంపారంటూ సోనియా బిగ్ బాస్ పై రివర్స్ అయింది.