Nandamuri: ఈ సారి అంచనాలకు మించి.. NBK108 ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

అఖండ, వీరసింహారెడ్డి లాంటి హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. యంగ్‌ హీరోస్‌కు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు 108 చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరిచేందుకు వస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడదల చేశారు మూవీ యూనిట్‌.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 08:00 PM IST

ఉగాది సందర్భంగా అభిమనులకు కానుకగా పోస్టర్‌ రీలీజ్‌ చేశారు. మీ అంచనాలకు మించి ఉంటుంది అన్న కొటేషన్‌తో పోస్టర్‌తోనే సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు. అటు మాస్‌ కాకుండా ఇటు క్లాస్‌ కాకుండా ఓ కల్ట్‌ లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నారు. దీంతో మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా రాబోతుందనే అంనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఫాస్ట్‌గా పరుగులు పెట్టిస్తున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ సినిమాలో టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గానే ఆమె కూడా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యింది. హీరోయిన్‌ శ్రీలీల కూడా ఈ సినిమాలో ఓ క్యారెక్టర్‌ చేస్తోంది. తమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

ప్రస్తుతానికి NBK108 వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు త్వరలోనే టైటిల్‌ కూడా ఖరారు చేయనున్నారు. వీర హింహారెడ్డి, ఆఖండ మాదిరిగానే ఈ సినిమాకు కూడా వపర్‌ఫుల్‌ టైటిల్‌ వెతికే పనిలో ఉన్నారు మూవీ యూనిట్‌. అయితే అనిల్‌ రావిపూడ్‌ క్లాసిక్‌ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కానీ ఇప్పుడు రిలీజ్‌ చేసిన బాలకృష్ణ లుక్‌ మాత్రం చాలా మాస్‌గా కనిపిస్తోంది. దీంతో ఈసారి అనిల్‌ డిఫరెంట్‌గా గట్టిగానే ప్లాన్‌ చేసి ఉంటాడంటున్నారు ఫ్యాన్స్‌. పోస్టర్‌ మీద కూడా అదే కొటేషన్‌ రాసి ఉండటంతో NBK108పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.