Akhanda 2: నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే చాలు అభిమానులు పులకరించిపోతారు. తెర మీద తప్ప నిజ జీవితంలో యాక్టింగ్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఆ వ్యక్తిత్వమే ఆయనకు కొన్ని లక్షల మందిని అభిమానులుగా చేసింది. తెలుగు సినీ సీమలో డైలాగ్ చెప్పాలంటే బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అనే కీర్తిని కూడా సంపాదించాడు. ఆ మాట నిజం అని చాలా మంది హీరోలు ఆన్ ది రికార్డుగానే చెప్పారు.
KALKI 2898 AD: కల్కి అమితాబ్ యంగ్ లుక్‌పై రచ్చ.. కొరటాల తప్పే నాగి చేస్తున్నాడా ?
ఇప్పుడు బాలయ్య నోటి వెంట దక్షిణ భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు.. హిందుత్వానికి ప్రతి రూపం.. ఇది ఎవరు కాదనలేరు అనే మాటలు రాబోతున్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ రాబోయే సినిమాల్లో అఖండ 2 ఒకటి. బోయపాటి శ్రీను దర్శకుడు. అఖండ సూపర్ డూపర్ హిట్ కావడంతో అఖండ 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఇదే అంటు సోషల్ మీడియాలో ఒక వార్త హల్‌చల్ చేస్తుంది. అఖండ 2 కథ మొత్తం పూర్తిగా శైవత్వంపై సాగబోతుంది. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అని సినిమాలో చెప్పబోతున్నారు. ఆ యాంగిల్‌లోనే సీన్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే మొత్తం హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్‌ని కూడా బయటపెట్టబోతున్నారు. టోటల్‌గా దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని ఎలివేట్ చెయ్యబోతున్నారు. ఈ న్యూస్ అయితే బాలయ్య ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది.
మొదటి పార్ట్‌లో శివతత్వాన్ని నింపుకొన్న అఘోరాగా బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఒక రెండు నిమిషాలు పాటు హిందూ ధర్మం గురించి ఆయన చెప్పిన డైలాగ్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాంటిది ఇప్పుడు అఖండ 2లో మూవీ మొత్తం హిందూ ధర్మం గురించి చెప్పబోతుండటంతో అందరిలో ఎనలేని ఆసక్తి ఉంది. అక్టోబర్ నుంచి మూవీ స్టార్ట్ కాబోతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సంజయ్ దత్.. బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అయితే పక్కా అంటున్నారు. ప్రొడ్యూసర్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.