NANDAMURI BALAKRISHNA: పారితోషికం పెంచిన బాలయ్య.. ఆ విషయంలో చిరునే నెంబర్ వన్..!

నటసింహం బాలయ్య తన పారితోషికం రూ.10 కోట్లు పెంచి, రూ.28 కోట్లకు చేర్చాడు. అఖండ ముందువరకు రూ.10 నుంచి రూ.11 కోట్లు తీసుకునే బాలయ్య.. వీర సింహా రెడ్డికి రూ.14 కోట్లు తీసుకున్నాడు. భగవంత్ కేసరికి కూడా రూ.14 కోట్లు తీసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - October 30, 2023 / 05:39 PM IST

NANDAMURI BALAKRISHNA: సూపర్ మార్కెట్లో సరకుల ధరలు వేగంగా మారకపోవచ్చు. కానీ, టమాటాలు, ఉల్లి ధరలు సీజన్‌కోసారి పెరగటమో, తగ్గటమో కామన్. అలాంటిదే ఫిల్మ్ ఇండస్ట్రీలో సీజన్‌కోసారి మారుతుంది. మెగాస్టార్ నుంచి నటసింహం వరకు స్టార్స్ రెమ్యునరేషన్ లెక్కలు మారిపోయాయి.

నటసింహం బాలయ్య తన పారితోషికం రూ.10 కోట్లు పెంచి, రూ.28 కోట్లకు చేర్చాడు. అఖండ ముందువరకు రూ.10 నుంచి రూ.11 కోట్లు తీసుకునే బాలయ్య.. వీర సింహా రెడ్డికి రూ.14 కోట్లు తీసుకున్నాడు. భగవంత్ కేసరికి కూడా రూ.14 కోట్లు తీసుకున్నాడు. అయితే, సినిమా హిట్ తర్వాత తనకి మరో 4 ఇచ్చారు. అంటే మొత్తం రెమ్యునరేషన్ రూ.18 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు బాబీ మేకింగ్‌లో బాలయ్య సినిమా చేస్తున్నాడు. దానికి ఏకంగా రూ.28 కోట్లు అంటే రూ.10 కోట్ల హైక్‌తో షాక్ ఇచ్చాడు. కానీ, ఈ విషయంలో ఇప్పటికీ సీనియర్స్‌లో టాప్ పొజీషన్ మెగాస్టార్ చిరంజీవిదే. రూ.50 కోట్లు తీసుకుంటున్న చిరు.. టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్‌లో మాత్రం నెంబర్ వన్ పొజీషన్‌లోనే ఉన్నారు.

ఇక.. నాగ్, వెంకీ రూ.12 కోట్ల రెమ్యునరేషన్‌తో సరిపెట్టుకుంటున్నారు. కాకపోతే రూ.90 కోట్లతో మహేశ్, రూ.110 కోట్లతో పవన్, రూ.150 కోట్లతో ప్రభాస్ ఎప్పుడో పారితోషికంలో చిరుని మించారు. చరణ్, ఎన్టీఆర్, బన్నీ కూడా రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల డిమాండ్‌తో వాళ్లు కూడా మెగాస్టార్‌ని మించారు.