NBK 109: బాలయ్యకే ఇలాంటి విచిత్రాలు సాధ్యమా..?

మహాశివరాత్రి స్పెషల్‌గా బాలయ్య కొత్త మూవీ గ్లింప్స్ వచ్చింది. మతిపోగొట్టేస్తోంది. అఖండ తర్వాత బాలయ్యని చూస్తే దర్శకులకు పూనకాలు పెరిగాయేయో కాని, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సీన్లలో మ్యాజిక్ ఉండేలా చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 04:15 PM IST

NBK 109: నటసింహం బాలయ్య మరో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటారు. ఎందుకంటే రియల్‌గా జరగనివన్నీ తన మూవీల్లోనే జరుగుతాయి. చిటికేస్తే చైర్ రావటం, వెనక్కి వెళ్లమంటే రైలు రివర్స్ గేరులో వెనక్కి వెళ్లటం ఇలాంటి వింతలు, విచిత్రాలు రజినీకాంత్ సినిమాల్లోనే కాదు.. బాలయ్య మూవీల్లో కూడా జరుగుతాయి. అది నటసింహం కూడా ఒప్పుకున్నాడు. దాన్ని సరదాగానే తీసుకున్నాడు. అలాంటి బాలయ్య ఇప్పుడు గొడ్డలి పట్టాడు.

GAAMI VS BHIMA: గామి వర్సెస్ భీమా.. ఏది హిట్టు..?

కొత్త కోత మొదలు పెట్టాడు. బాబీ డైరెక్షన్‌లో ఊపుంది ఊపేస్తానంటున్నాడు. మహాశివరాత్రి స్పెషల్‌గా బాలయ్య కొత్త మూవీ గ్లింప్స్ వచ్చింది. మతిపోగొట్టేస్తోంది. అఖండ తర్వాత బాలయ్యని చూస్తే దర్శకులకు పూనకాలు పెరిగాయేయో కాని, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సీన్లలో మ్యాజిక్ ఉండేలా చూస్తున్నారు. అఖండలో బాలయ్య అఘోర కాబట్టి కాస్త శక్తులుంటాయి. అందుకే తను చక్రం తిప్పినా, గూండాలని ఆకాశంలోకి ఎగరేసినా నమ్మారు. కాని తర్వాత ఏమైంది..? అదే ఊపుతో ఇదేదో బాగుందని గోపీచంద్ మలినేని కూడా వీర సింహారెడ్డిలో అదే పనిచేశాడు.

బాలయ్యతో గూండాలను ఫుడ్ బాల్‌ని తన్నినట్టు తన్నించాడు. అక్కడే లాజిక్ మిస్సై కాస్త అతి అనిపించిందన్నారు. కామెంట్లు పేల్చారు. ఇప్పుడు బాబీ కూడా నెక్ట్స్ లెవల్‌లోకెళ్లి బాలయ్యతో ఊచకోత ప్లాన్ చేసినట్టున్నాడు. గ్లింప్స్‌తో ఆ ఊచకోత ఎలా ఉంటుందో తేలిపోయింది.