Nandamuri Balakrishna: భగవంత్ కేసరితో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. 109వ (NBK109) సినిమాను తన బర్డ్ డే రోజు అఫిషియల్‌గా ప్రకటించిన బాలయ్య.. ఇప్పుడు ఫుల్ ఫోకస్ దానిపైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ (BOBBY) తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దర్శకుడు బాబీ.. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సారి ఈ యంగ్ డైరెక్టర్.. బాలయ్యతో కూడా ఒక పవర్‌ఫుల్ సినిమా తీసి హిట్ అందుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ నెల ఆరో తేదీ జరగనున్న షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం పూర్తి సెట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రం కోసం బాలయ్య తన రెమ్యునరేషన్ పెంచేశాడని.. దాదాపు రూ.28కోట్లు ఛార్జ్ చేయబోతున్నారని కథనాలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. తండ్రీ, కొడుకులుగా బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం. బాలయ్య అలాంటి పాత్రలు చాలానే చేసారు. మరీ బాబీ తన సినిమాలో బాలయ్యను ఎలా చూపిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందించబోతున్నారు.