Nandamuri Balakrishna: బాలయ్య నెక్ట్స్.. ఆ ముగ్గురిలో ఎవరికి ఓటేస్తాడో

ఇది ఓ పక్క షూటింగ్‌ జరుపుకుంటుండగానే NBK110 మూవీపై అప్పుడే ఆసక్తి ఏర్పడింది. బాలయ్య తన 110వ సినిమాను ఎవరితో చేయబోతున్నారనే సస్పెన్స్‌.. అభిమానులను ఊరిస్తోంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ స్పీడు మీదున్నాడు.

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 04:45 PM IST

Nandamuri Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమా మీద సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఇప్పుడు తన 109వ సినిమాని దర్శకుడు బాబీతో చేస్తున్నాడు. NBK109 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని మేకర్స్ భావిస్తున్నారు. ఇది ఓ పక్క షూటింగ్‌ జరుపుకుంటుండగానే NBK110 మూవీపై అప్పుడే ఆసక్తి ఏర్పడింది.

Deepika Padukone: ప్రెగ్నెన్సీ పుకార్లు.. తల్లి కాబోతున్న దీపికా పదుకొనే..?

బాలయ్య తన 110వ సినిమాను ఎవరితో చేయబోతున్నారనే సస్పెన్స్‌.. అభిమానులను ఊరిస్తోంది. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంతంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో.. అఖండ పార్ట్‌-2 ఇప్పటికే లైన్‌లో ఉంది. కానీ ఇదే 110వ సినిమా అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు.. ఇక లేటెస్ట్‌గానే స్టార్ దర్శకుడు హరీష్ శంకర్‌‌తో కూడా బాలయ్య తదుపరి సినిమా ఉంటుందని ఓ టాక్ వినిపించింది. ఇది ఎంత వరకు నిజం అన్నది తేలేలోగానే.. ఇప్పుడు మరో న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో బాలయ్య 110వ మూవీ ఉంటుందని ఓ న్యూస్ వినిపిస్తోంది.. ఇలా రకరకాలుగా వినిపిస్తున్న వార్తలతో బాలయ్య 110వ సినిమాపై టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వీరిలో బాలయ్య ఎవరికి ఓకే చెప్తారా అన్నదానిపై ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా.. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ స్పీడు మీదున్నాడు.

అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహరెడ్డి సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాగా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమాతో బాలయ్య రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా రచ్చలేపే రేటింగ్ సాధించింది. ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఇలా కుర్రహీరోలకు ధీటుగా స్పీడుతో దూసుకెళ్తున్న బాలయ్య మరెన్ని సాలిడ్ హిట్లు కొడతాడో చూడాలి మరి.