KALKI 2898 AD: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ లెవెల్‌లో సంచలనాలు సృష్టించగల తెలుగు సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్నది ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే భాగమయ్యారు.
Pawan Kalyan: యాత్ర2కు పోటీగా రాంబాబు.. ఏపీలో పోటా పోటీగా సినిమాలు
అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులో మరో తెలుగు స్టార్ చేరినట్లు తెలుస్తోంది. ‘కల్కి’లో నేచురల్ స్టార్ నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని కృపాచార్యుడిగా కనిపించనున్నాడని ఇన్‌సైడ్ టాక్. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువుగా.. సప్త చిరంజీవులలో ఒకడిగా కృపాచార్యుడుకి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి పాత్రలో నాని కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో నానికి మంచి అనుబంధం ఉంది.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నానినే హీరో. ఆ అనుబంధంతోనే సినిమాకి కీలకమైన కృపాచార్యుడు పాత్రలో నటించాలని నానిని కోరాడట నాగ్ అశ్విన్. దిగ్గజ నటులతో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న భారీ సినిమా కావడంతో పాటు, తనది కీలకమైన కృపాచార్యుడి పాత్ర కావడంతో నాని వెంటనే అంగీకరించాడట. సినిమాలో ఈ పాత్ర బిగ్ సర్‌ప్రైజ్‌లా ఉంటుందని సమాచారం.