NANI: తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కే నాని ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికీ’ మూవీ నిరాశపరిచింది. అయినా, దర్శకుడికి నాని మరో ఛాన్స్ ఎందుకిచ్చాడు అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. అంటే సుందరానికీ తీసేసే సినిమా కాకపోయినా.. దర్శకుడు మొండితనంతో ఫ్లాప్ చేసుకున్నాడు. సినిమా చూసిన వాళ్లందరికీ నచ్చింది. కాకపోతే లెంగ్త్ తగ్గిస్తే బాగుండేదన్నారు. 20 నిమిషాలు ట్రిమ్ చేయడానికి డైరెక్టర్ ఒప్పుకోలేదు.
లేదంటే సినిమా రిజల్ట్ మరోలా వుండేది. నాని కెరీర్‌లో కామెడీ మూవీస్ చాలా చేశాడు. వాటిలో గుర్తిండిపోయే మూవీ అంటే సుందరానికీ సినిమా నిరాశపరిచినా.. డైరెక్టర్ వర్క్ నచ్చి మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. సినిమా ఈనెల 24న మొదలవుతుందని నిర్మాత డివివి దానయ్య ఎనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. నాని, వివేక్ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అన్న టైటిల్ అనుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ్ డెబ్యూ మూవీ ‘మెంటల్ మదిలో’. టైటిల్లో క్లారిటీ వుంది. రెండో మూవీ బ్రోచేవారెవరురా. మూడో మూవీ అంటే సుందరానికీతో ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేశాడు. నాలుగో సినిమాకు కూడా ఇదే తరహా టైటిల్‌ను సెలెక్ట్ చేసుకుంటూ.. ‘సరిపోదా శనివారం’ అంటున్నాడు.
ఈ సినిమాకు నాని ఫ్లాప్ డైరెక్టర్‌నే కాదు.. ఫ్లాప్ హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. గ్యాంగ్ లీడర్‌లో నానితో జత కట్టిన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఓపెనింగ్ డే సందర్భంగా హీరోయిన్ పేరు ఎనౌన్స్ చేసే అవకాశం వుంది. ప్రియాంకకు తెలుగులో సక్సెస్ లేకపోయినా.. తమిళంలో వరుస హిట్స్‌తో ఉంది. దీంతో మళ్లీ టాలీవుడ్‌లో ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఓజీలో పవన్‌తో నటిస్తోంది.