నాని ‘హాయ్ నాన్న’.. నితిన్ ‘ఎక్స్‌స్ట్రా’ ప్రమోషన్‌లోనే కాదు.. బిజినెస్‌లోనూ పోటీపడుతున్నాయి. ఫ్లాపుల్లో వున్న నితిన్ ఎక్స్‌స్ట్రాతో గట్టి పోటీనే ఇచ్చాడు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాలుగు సినిమాలు రావాల్సి వుంది. విశ్వక్ సేన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. వరుణ్‌తేజ్ స్పై థ్రిల్లర్ ‘ఆపరేషన్ వాలేంటేన్’ పోస్ట్ పోన్ అయ్యాయి. పోటీలో నాని.. నితిన్ సినిమాలు మిగిలాయి. హాయ్ నాన్న తండ్రీ కూతురు సెంటిమెంట్ మూవీ అయితే.. ఎక్స్‌స్ట్రా ఫుల్ లెంగ్త్ కామెడీగా వస్తోంది. ఈ కాంపిటీషన్ కాస్తా.. సెంటిమెంట్ వర్సెస్ ఎంటర్‌టైన్ మెంట్‌గా మారిపోయింది.
నాని లాస్ట్ మూవీ దసరా పాన్ ఇండియాగా రిలీజైతే తెలుగు ఆడియన్స్‌కు మాత్రమే నచ్చింది. హాయ్‌నాన్నతో మరోసారి పాన్ ఇండియా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నేచురల్ స్టార్. దసరా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ కావడంతో.. వరల్డ్‌వైడ్ 50 కోట్ల బిజినెస్ జరుపుకుంది. దసరాలా హాయ్ నాన్న భారీ బడ్జెట్ మూవీ కాకపోవడం.. సెంటిమెంట్ జానర్ కావడంతో.. 27 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక నితిన్ అయితే.. భీష్మ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. మరోసారి కామెడీనే నమ్ముకుంటూ.. హిట్ తీసుకొస్తుందన్న నమ్మకంతో వున్నాడు నితిన్. సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ కావాలంటే.. 25 కోట్లు రాబట్టాలి.