NANI: విజయ్ దేవరకొండని రీచ్ కాలేకపోతున్న నాని..

ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని పక్కన సెకండ్ హీరోగా కనిపించాడు విజయ్. అలాంటి విజయ్‌కి పాన్ ఇండియా హిట్లు లేకున్నా పాన్ ఇండియా మార్కెట్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. కానీ, నాని కెరీర్‌లో దసరా, శ్యామ్ సింగరాయ్.. ఇలా లెక్కేస్తే 80 శాతం హిట్లున్నాయి.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 06:05 PM IST

NANI: విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్. ఖుషీ యావరేజ్. ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి కాకుండా మార్చ్‌కి షిఫ్ట్ అవుతోంది. ఇంత జరిగినా తనకి తెలుగుతోపాటు నార్త్ ఇండియాలో, అలాగే తమిళ్, మలయాళ, కన్నడ యూత్‌లో క్రేజ్ తగ్గలేదు. సరైన సినిమాలు లేకున్నా విజయ్‌కు ఆ క్రేజ్ అలాగే ఉంటోంది. కానీ, నాచురల్ స్టార్ నాని ఎన్ని హిట్లు సొంతం చేసుకుంటున్నా విజయ్ రేంజ్ అందుకోవడం లేదు. నానికి విజయ్ దేవరకొండ రేంజ్ కాదు కదా.. అందులో సగం కూడాక్రేజ్ రావట్లేదు.

SALAAR FIRST REVIEW: సైడ్ ఇవ్వాల్సిందే.. సలార్ ఫస్ట్ రివ్యూ..

ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని పక్కన సెకండ్ హీరోగా కనిపించాడు విజయ్. అలాంటి విజయ్‌కి పాన్ ఇండియా హిట్లు లేకున్నా పాన్ ఇండియా మార్కెట్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. కానీ, నాని కెరీర్‌లో దసరా, శ్యామ్ సింగరాయ్.. ఇలా లెక్కేస్తే 80 శాతం హిట్లున్నాయి. నటుడిగా న్యాచురల్ స్టార్ అని పేరొచ్చింది. అయినా ఇక్కడి యూత్‌లో భూమి బద్దలయ్యేంత ఫాలోయింగ్ లేదు. ఇక తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గుర్తింపు ఉన్నా.. పెద్దగా క్రేజ్ లేదు. దీనికి కారణం అర్జున్ రెడ్డితో విజయ్‌కి వచ్చిన స్పెషల్ ఇమేజ్. అది కూడా ఒక కారణం కావొచ్చు. కాని, విజయ్ సినిమాలు ఎక్కువ శాతం యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో టీనేజర్స్‌లోకి చొచ్చుకుపోయాడు.

విజయ్‌తో పోలిస్తే నాని పర్ఫెక్షనిస్ట్. మంచి నటుడు కూడా. కానీ.. క్రేజ్ క్రియేట్ కావాలంటే కొన్ని సార్లు అర్జున్ రెడ్డి లాంటి విచిత్రమైన సినిమాలు పడాలి. అలా వచ్చిన క్రేజ్‌వల్లే తర్వాత ఫ్లాపులు వచ్చినా తన ఫాలోయింగ్ తగ్గకుండా ఉంది.