Nani: రౌడీ స్టార్‌ని రీచ్ అయ్యేందుకు టైం తీసుకున్న నాని..!

పెళ్లి చూపులు హిట్ అవటంతో విజయ్‌కు హీరోగా పేరొచ్చింది. అర్జున్ రెడ్డితోనే తన స్టార్‌డమ్ పెరిగింది. సీన్ మారింది. అయితే ఈ విషయంలో మాస్ ఇమేజ్‌తోపాటు రెమ్యునరేషన్ విషయంలో విజయ్‌ని రీచ్ అయ్యేందుకు న్యాచరల్ స్టార్ నానికి నాలుగేళ్లు పట్టింది.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 06:26 PM IST

Nani: విజయ్ దేవరకొండ హీరోగా మారకముందే నాని న్యాచురల్ స్టార్. ఏవడే సుబ్రహ్మణ్యంలో నాని హీరో అయితే రౌడీ స్టార్ విజయ్ మాత్రం సైడ్ హీరోగా చేశాడు. తర్వాత పెళ్లి చూపులు హిట్ అవటంతో విజయ్‌కు హీరోగా పేరొచ్చింది. అర్జున్ రెడ్డితోనే తన స్టార్‌డమ్ పెరిగింది. సీన్ మారింది. అయితే ఈ విషయంలో మాస్ ఇమేజ్‌తోపాటు రెమ్యునరేషన్ విషయంలో విజయ్‌ని రీచ్ అయ్యేందుకు న్యాచరల్ స్టార్ నానికి నాలుగేళ్లు పట్టింది. నాని ఓ ఏడాది క్రితం లేదంటే రెండేళ్ల క్రితం రూ.10 నుంచి రూ.15 కోట్లు తీసుకునే వాడు.

ఇప్పడు ఏకంగా పాతిక కోట్లు తీసుకుంటున్నాడు. దసరా హిట్ తర్వాతే తన డిమాండ్ పెరిగితే పెరగొచ్చు. హాయ్ నాన్నకు రూ.22 కోట్లు తీసుకున్న నాని, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో మరోసారి చేయబోయే ప్రయోగానికి పాతికోట్లు తీసుకుంటున్నాడట. డీవీవీ దానయ్య నిర్మించబోయే ఈ సినిమాకు రూ.25 కోట్లు తీసుకుంటూ నాని షాక్ ఇచ్చాడు. ఐతే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఇదే పాతికకోట్లు లైగర్ కంటే ముందే వరల్డ్ ఫేమస్ లవర్‌ మూవీకి తీసుకున్నాడు రౌడీస్టార్. సో.. ఈ రేంజ్‌కి రావటానికి విజయ్‌కి మూడేళ్ల టైం పడితే.. నానికి దశాబ్దంపైగా టైం పట్టింది.

విచిత్రం ఏంటేంటే లైగర్‌కి రూ.35 కోట్లు తీసుకున్న విజయ్.. ఆ మూవీ ప్లాప్ అవటంతో ప్రజెంట్ రూ.25 కోట్లే డిమాండ్ చేస్తున్నాడట. అలా లైగర్ ప్లాప్ కాకపోతే నాని ఇంకా విజయ్‌ని రీచ్ అయ్యేందుకు మరింత టైం పట్టేదనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా నాని తర్వాత వచ్చి, నాని మూవీలో సెకండ్ హీరోగా చేసిన స్టార్ కాబట్టే ఈ కంపేరిజన్స్ కామన్‌గా పెరిగాయి.