నాని నిర్మాతగా చిరు కొత్త మూవీ

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమా గురించి..ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చిరు నటిస్తారని గాసిప్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్త నిజమైంది.

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 10:55 AM IST

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమా గురించి..ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చిరు నటిస్తారని గాసిప్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్త నిజమైంది. ఈ ప్రాజెక్టును నాని సమర్పణలో, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్.. మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. పోస్టర్‌లో చిరంజీవి రక్తం కారుతున్న చెయ్యి కనిపిస్తోంది. అతను తన ప్రశాంతతను వైలెన్స్‌లో వెతుక్కుంటాడు అనే వాక్యంతో ఈ సినిమా చిరు కెరీర్‌లోనే అత్యంత మాస్ యాక్షన్ సినిమాగా రానుంది అని చెప్పకనే చెప్పేశారు. ఈ ప్రకటనతో అభిమానుల.. అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఈ సినిమా ప్రకటనపై నాని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. తాను ఆయన్ని చూస్తూ పెరిగాననీ, ఆయన సినిమాల టికెట్లు కోసం లైన్లో నిల్చున్నానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయనతో సినిమాని నిర్మించడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ నాని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ మెగా అభిమానులకు మరింత కిక్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరు సినిమా ప్రారంభం కానుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు