NANI: ఆరు పదుల వయసు దాటినా ఆహా అనిపించే సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు విశ్వ నటుడు కమల్ హాసన్. కుర్ర హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలు చేస్తూ సవాల్ విసురుతున్నారు. ‘విక్రమ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అదే జోష్‌తో ‘ఇండియన్-2’ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం కమల్.. మణిరత్నంతో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నాడు.
MUDRAGADA : వైసీపీలోకి ముద్రగడ.. ఏ హామీ లేకుండానే…
ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ చేసింది. ‘నాయకుడు’ వంటి కల్ట్ సినిమా తర్వాత వీళ్ల కాంబోలో ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయారు. నాయకుడు తర్వాత.. దాదాపు 36 సంవత్సరాలకు ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో అందరిలోనూ తిరుగులేని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి దుల్కర్ తప్పుకున్నట్లు చెన్నై టాక్. ప్రస్తుతం తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడట. పైగా ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నీ హీరోగా చేయడంతో.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం కుదరక తప్పుకున్నట్లు టాక్. అంతేకాక ఇప్పుడా ఆ రోల్ నాని చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. రోల్ నచ్చితే మాత్రం నాని ఖచ్చితంగా సినిమా చేస్తాడన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. నాని అమితంగా అభిమానించే హీరోల్లో కమల్ హాసన్ కూడా ఒకడు. అదీ కాకుండా మణిరత్నం అంటే నానికి చాలా ఇష్టమైన దర్శకుడు.
కేవలం ఆయన అడిగాడనే కారణంతో ఒకే బంగారం సినిమాలో దుల్కర్ కు డబ్బింగ్ కూడా చెప్పాడు. అలాంటిది మణిరత్నం రోల్ ఆఫర్ చేస్తే చేయకుండా మత్రం అస్సలు ఉండడు. ఈ న్యూస్ గనుక నిజమైతే తెలుగులోనూ ‘థగ్ లైఫ్’ సినిమాకు తిరుగులేని హైప్ క్రియేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం నాని కున్న బిజీ షెడ్యూల్ లో అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నాని ప్రస్తుతం చేస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్ పూర్తి కాగానే.. సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ‘బలగం’ దర్శకుడు వేణుతో ఓ విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. చూడాలి మరీ దుల్కర్ రోల్‌ను నాని రీప్లేస్ చేస్తాడా లేదా అని.