సినిమా వాళ్ళ పెళ్లి, విడాకులు, సహజీవనం అనేది హాట్ టాపిక్. దీని గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు మాత్రం వాళ్లకు నచ్చింది ఊహించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న నటులు అయితే పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు గాని పెద్ద నటులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు అయితే మాత్రం ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఇందులో విజయ నిర్మల కుమారుడు నరేష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన నాలుగు వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో వివాహం పవిత్ర లోకేష్ ను చేసుకున్నారు.
ఈ వివాహంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నరేష్ ను కేవలం ఆమె ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. విజయ నిర్మల మరణం కంటే ముందే పవిత్ర లోకేష్… నరేష్ జీవితంలోకి వచ్చారని ఆమె వద్దు అన్నారని ఆమె మరణం తర్వాతనే పవిత్ర ను ఆయన వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నరేష్… పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నారు. పవిత్ర ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన వైవాహిక జీవితంపై నరేష్ స్పందించారు.
తను నాలుగు వివాహాలపై నరేష్ మాట్లాడుతూ.. కాస్త ఫన్నీగా మాట్లాడారు. మీ అనుభవంలో పెళ్లి హ్యాపీనా… చేసుకోకపోతే మంచిదా అని ఒక జర్నలిస్ట్… సుందరాకాండ సినిమా ప్రెస్ మీట్ లో అడిగారు. దీనికి స్పందించిన నరేష్… ఇప్పటి తరం వాళ్ళు అసలు పెళ్లి వద్దు అనుకుంటున్నారు, కాని ఇంతకు ముందు తరాలు మరోసారి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాయి… సంతోషంగా ఉందామనే ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి అని ఆయన తన మార్క్ కామెంట్స్ చేయడంతో అందరూ నవ్వేసారు. నరేష్ ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపారాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.