Naseeruddin Shah: ఆర్ఆర్ఆర్, పుష్పకి అవమానం.. బాలీవుడ్ నటుడి మాటలకు అర్ధం వేరా..?

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో ప్రయోగాలు, ఇంకెన్నో గొప్ప పాత్రలు వేసిన ఈ నటుడికి త్రిబుల్ ఆర్, పుష్ప మూవీలు నచ్చలేదట. ఇంకా చెప్పాలంటే.. అసలు కాస్త కూడా చూసేంత కంటెంట్ లేదనే మాటే సూటవుతుందేమో.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 05:42 PM IST

Naseeruddin Shah: ‘త్రిబుల్ ఆర్ మూవీ చూడాలనిపించలేదు. కొద్దిసేపు చూసి ఇక చూడలేకపోయా. పుష్ప కూడా అంతే. అవేం సినిమాలో’.. ఇవీ.. బాలీవుడ్ లివింగ్ లెజెండ్‌గా పిలిచే నసీరుద్దిన్ షా మాటలు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో ప్రయోగాలు, ఇంకెన్నో గొప్ప పాత్రలు వేసిన ఈ నటుడికి త్రిబుల్ ఆర్, పుష్ప మూవీలు నచ్చలేదట. ఇంకా చెప్పాలంటే.. అసలు కాస్త కూడా చూసేంత కంటెంట్ లేదనే మాటే సూటవుతుందేమో. అంత అవమానం రెండు తెలుగు సినిమాలకు జరిగింది.

అది కూడా పాన్ ఇండియా లెవల్లో దేశాన్ని కుదిపేసిన సినిమాలకు. అటు చరణ్, తారక్, ఇటు బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అవ్వొచ్చు. కాని, ఇక్కడ ఈ రెండు సినిమాలను అవమానించాలన్న ఉద్దేశ్యంతో నసీరుద్దిన్ షా అలాంటి కామెంట్లు చేయలేదు. ఈ ప్రపంచంలో ముఖ్యంగా మగాళ్లలో ఇన్‌సెక్యూరిటీ పెరిగింది. కండలను చూపించే హీరోయిజమే పెరిగింది అనంటున్నాడు నసీరుద్దిన్ షా… అందుకే మజిల్స్ పెంచి హీరోయిజాన్ని అందులో చూపిస్తున్నారు. హాలీవుడ్‌లో అయితే సూపర్ హీరోలంటూ మార్వెల్ స్టూడియో ఓ సెపరేట్ ప్రపంచాన్నే రెడీ చేసిందన్నాడు. ఇక త్రిబుల్ ఆర్‌లో ఇద్దరు యోధులని చూపించారు. కాని, ఇది ఎంతవరకు, ఎంతమంది లేడీస్‌కి నచ్చి ఉంటుంది? ఈ డౌట్ కూడా వేసింది నసీరుద్దిన్ షా.

అంతేకాదు సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌ని కూడా ఇలానే విమర్శించాడు. విచిత్రంగా నసీరుద్దీన్‌కు తమిళ్‌లో తప్ప ఎక్కడా ఆడని పొన్నియన్ సెల్వం మాత్రం నచ్చిందట. మణిరత్నం ఒక్కడే రహస్య ఎజెండాలు లేకుండా సినిమాలు తీసేవాడన్నాడు నసీరుద్దిన్ షా. అంటే తను విమర్శించిన సినిమాలు, వాటిని తీసిన దర్శకుడు రహస్య ఎజెండాతో మూవీలు తీసినట్టా? ఏదేమైనా సోషల్ మీడియాలో తన కామెంట్స్ ఇప్పుడు వైరలయ్యాయి.