సినీ ప్రపంచంలో ప్రతీ యాక్టర్ ఎంతో ప్రెస్టీజియస్‌గా భావించే ఆస్కార్ అవార్డ్ ప్రజెంటేషన్ రేపు జరగనుంది. ట్రిపులార్ టీం ఇండియాకు ఆస్కార్ తీసుకువస్తారా లేదా అనే ఉత్కంఠ ప్రతీ భారతీయుడిలో ఉంది. ఆస్కార్ ఈవెంట్‌లో రేపు నాటు నాటు సాంగ్ లైవ్ కన్సర్ట్ కూడా జరగనుంది. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు సాంగ్ పాడబోతున్నారు. దీనితోపాటు డాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది.
ఈ పాటకు అమెరికన్ డాన్సర్ లారెన్స్ గాబ్లెట్ డాన్స్ చేయనుంది. నిజానికి రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ సాంగ్ పాడుతుంటే.. ఎన్టీఆర్, రాచ్ చరణ్ డాన్స్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ లాస్ట్ మినట్‌లో తాము పెర్ఫ్మార్మెన్స్ ఇవ్వడంలేదని ఎన్టీఆర్ చెప్పాడు. నాటు నాటు సాంగ్‌లో చేయాల్సి స్టెప్స్ చాలా కష్టంగా ఉంటాయి. సాంగ్‌కు ఆస్కార్ రావడానికి ఆ స్టెప్స్ కూడా ఓ కారణం. అలాంటి స్టెప్స్ చేయాలంటే రిహార్సల్ ఉండాల్సిందే. కానీ ఆస్కార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం కారణంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అంత టైం దొరకలేదు.
రిహార్సల్స్ లేకుండా నాటు నాటు లాంటి సాంగ్‌కి డాన్స్ చేయడం అంటే కష్టమే. కాబట్టి తాము డాన్స్ చేయడంలేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో తారక్, చెర్రీ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. వాళ్లు చేయకపోయినా.. నాటు నాటు సిగ్నేచర్ మూమెంట్ మాత్రం ఆస్కార్ స్టేజి మీద కనిపించనుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ అదరగొట్టేసిన సాంగ్‌కు.. లారెన్ గాబ్లెట్ ఎలా డాన్స్ చేస్తుందో చూసేందుకు నాటు నాటు సాంగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.