RRR SONG: ఆస్కార్ పాట.. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకి 104 ఏళ్లు..!

స్క్రీన్ మీద ఎన్టీఆర్, చరణ్ నాటు నాటుగా డాన్స్ వేస్తుంటే వాళ్ళతో పాటు పాదం కలపని ప్రేక్షకుడు లేడు. ఈ పాటకి చెర్రీ, తారక్ డాన్స్ చేసి సరిగ్గా 104 ఏళ్ళు అవుతుంది. అవును నాటు నాటు పాట ద్వారా బ్రిటిష్ వాళ్ళకి తెలుగువాడి డాన్స్‌కి ఉన్న పవర్‌ని రుచి చూపించి 104 ఏళ్ళు అవుతోందట.

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 07:05 PM IST

RRR SONG: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కొమరం భీం అండ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించిన ఇండియన్ బిగ్గెస్ట్ ఫిక్షన్ మూవీ రౌద్రం రణం రుధిరం అలియాస్ ఆర్ఆర్ఆర్. సినిమాని తపస్సులా భావించి ప్రేక్షకులకి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చెయ్యాలని చూసే దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. భారతదేశం పోరాటయోధుల జీవితాల కథల గురించి ఈ తరానికి తెలియాలని జక్కన్న ఆర్ఆర్ఆర్‌కి ప్రాణం పోశాడు.

CHIRANJEEVI: ‘అల్లు’కి దూరంగా.. మెగా హీరోలు..

తాజాగా ఆర్ఆర్ఆర్ టీం ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు సాంగ్ ఎంతగా ప్రజాదరణ పొందిందో అందరకి తెలిసిన విషయమే. స్క్రీన్ మీద ఎన్టీఆర్, చరణ్ నాటు నాటుగా డాన్స్ వేస్తుంటే వాళ్ళతో పాటు పాదం కలపని ప్రేక్షకుడు లేడు. ఈ పాటకి చెర్రీ, తారక్ డాన్స్ చేసి సరిగ్గా 104 ఏళ్ళు అవుతుంది. అవును నాటు నాటు పాట ద్వారా బ్రిటిష్ వాళ్ళకి తెలుగువాడి డాన్స్‌కి ఉన్న పవర్‌ని రుచి చూపించి 104 ఏళ్ళు అవుతోందట. మీరు వినేది అక్షరాల నిజం. మీ కోసం విషయం పూర్తిగా చెప్తాను. ఆర్ఆర్ఆర్‌లో చరణ్, ఎన్టీఆర్‌లు ఫిబ్రవరి 14, 1920న నాటు నాటు పాటకి డాన్స్ వేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసింది. ఇప్పుడు ఈ మ్యాటర్ తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తుంది.

ఇక నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ని గెలుచుకొని తెలుగువాడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. కాబట్టి మేకర్స్ ఇప్పుడు నాటు నాటు సాంగ్‌ని తలుచుకోవడం సబబే అవుతుంది. ఆ పాటకి కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించాడు. అలాగే నాటునాటు పాటకి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది రీల్స్ చెయ్యడం జరిగింది.