Natural Star: దసరా ఫస్ట్‌ డే కలెక్షన్‌ ఎంతో తెలుసా ?

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన దసరా సినిమా.. ఆ అంచనాలకు మించి దూసుకుపోతోంది. కలెక్షన్స్‌లో కూడా తగ్గేదే అన్నట్టుగా దుమ్ములేపుతోంది. ఒక్క రోజులోనే 17 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 06:00 PM IST

నాని కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న సినిమాగా దసరా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రాబట్టలేదు. రీసెంట్‌గా రిలీజైన వాల్తేర్‌ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు. అటు ఓవర్సీస్‌లో కూడా సినిమా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మొదటి రోజు 6 లక్షల 37 వేల 938 డాలర్లు కలెక్ట్‌ చేసి టాప్‌ 4 సినిమాగా లీడ్‌లో ఉంది. పాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన దసరాకు.. రీలిజైన అన్ని భాషల్లో అద్భుతంగా ప్రమోషన్స్‌ నిర్వహించారు మూవీ మేకర్స్‌. సినిమాకు ఈ రేంజ్‌లో ఓపెనింగ్స్‌ రాడానికి ఆ ప్రమోషన్స్‌ మెయిన్‌ రీజన్‌. ఇక నాని కూడా యాక్టింగ్‌ ఇరదీశాడు. కీర్తి సురేష్‌ వెన్నెల క్యారెక్టర్‌లో జీవించింది. వీళ్లిద్దరి లవ్‌, రివేంజ్‌ డ్రామాకు ఆడియన్స్‌ ఫుల్‌ మార్క్స్‌ వేశారు. డెబ్యూ డైరెక్టర్‌ అయినా శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌ అదరగొట్టేశాడు. మొదటి రోజే కలెక్షన్స్‌ ఈ రేంజ్‌లో ఉంటే.. వారం పూర్తయ్యేసరికి దసరా మరిన్ని రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తుందంటున్నారు క్రిటిక్స్‌.