Nayanthara: డబ్బు కోసం నయనతార పాట్లు.. రూల్స్ బ్రేక్..!

నయనతార ఎంత పెద్ద స్టార్‌ పక్కన నటించినా సినిమా ప్రమోషన్‌కు రాదు. దీనికి అంగీకరించే ఈ అమ్మడిని తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. నిన్నటివరకు సోషల్‌ మీడియాకు దూరంగా వున్న నయన.. సొంత బిజినెస్‌ కోసం.. సోషల్‌ మీడియా ఎక్కింది.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 08:46 PM IST

Nayanthara: ఇంతకాలం కొన్ని లిమిటేషన్స్‌ పెట్టుకున్న నయనతార ఇప్పుడు డబ్బు కోసం వాటన్నింటినీ ఎత్తేసింది. సినిమాకు ఐదారు కోట్లు కాకుండా.. ఇంకా ఎక్కువ సంపాదించడం ఎలాగో ఫోకస్‌ పెట్టి బిజినెస్‌ ఉమెన్‌గా మారింది. ఈ క్రమంలో రూల్స్‌.. రెగ్యులేషన్స్‌ అటకెక్కించేసింది. నయనతార ఎంత పెద్ద స్టార్‌ పక్కన నటించినా సినిమా ప్రమోషన్‌కు రాదు. దీనికి అంగీకరించే ఈ అమ్మడిని తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. నిన్నటివరకు సోషల్‌ మీడియాకు దూరంగా వున్న నయన.. సొంత బిజినెస్‌ కోసం.. సోషల్‌ మీడియా ఎక్కింది.

ఇంతకాలం తన గురించి నయన ఏం చెప్పాలన్నా.. ఈమె గురించి ఏమి తెలియాలన్నా.. భర్త విఘ్నేష్‌ శివన్‌ పోస్టులతో తెలిసేది. సొంత బిజినెస్‌ కోసం.. ఆగస్ట్‌లో ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చి.. 5 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించింది నయన. జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. స్కిన్‌ షోకు దూరంగా వున్న నయన్‌.. సొంత స్కిన్ ప్రొడక్ట్ కోసం.. గ్లామర్‌గా కనిపించింది. సినిమా ప్రమోషన్‌కు హ్యాండ్‌ ఇచ్చినా.. ఓన్‌ బిజినెస్‌ కోసం.. భారీ లెవెల్లో ప్రమోషన్‌ స్టార్ట్‌ చేసింది. స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసే పనిలో నయన బిజీగా వుంది.

దీని కోసమే ఎప్పుడూ లేనిది సోషల్‌ మీడియాలో సందడి చేయడం స్టార్ట్ చేసింది. ఓన్‌ స్కిన్‌ ప్రొడక్ట్ కోసం.. రకరకాల యాడ్స్‌ చేసి ఇన్‌స్టాలో వదులుతూ బిజినెస్‌ ఉమెన్‌గా బిజీ అయిపోయింది నయన.