Nayanthara: నయనతారకు షాక్.. ఓటీటీ నుంచి అన్నపూరణి చిత్రం తొలగింపు..

ఇటీవలే ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. కానీ, ఈ చిత్రాన్ని తాజాగా ఓటీటీ నుంచి తొలగిస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ షాకిచ్చింది. అన్నపూరణి సినిమాపై పలు హిందూ, బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 04:56 PM IST

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ అన్నపూరణి. తమిళంలో గత డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. అయితే, అప్పట్లో తమిళనాడులో వర్షాల వల్ల సరైన కలెక్షన్లు రాలేదు. దీంతో ఈ చిత్రం యావరేజ్ కలెక్షన్లతోనే థియేటర్ల నుంచి నిష్క్రమించింది. అయితే, ఇటీవలే ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. కానీ, ఈ చిత్రాన్ని తాజాగా ఓటీటీ నుంచి తొలగిస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ షాకిచ్చింది.

GUNTUR KAARAM REVIEW: ‘గుంటూరు కారం’ ఎలా ఉంది..? ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

అన్నపూరణి సినిమాపై పలు హిందూ, బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగిన నయనతార.. నాన్ వెజ్ వండే షెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్రమంలో ఉన్న కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఈ చిత్రంపై విమర్శలొచ్చాయి. దీంతో మూవీని బ్యాన్‌ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాయి. కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. పలు వైపుల నుంచి వ్యతిరేకత, విమర్శలు, న్యాయ పరమైన సమస్యల్ని చిత్ర నిర్మాతలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతోపాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

అయితే, ఇన్ని విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని తమ డిజిటల్‌ స్ట్రీమ్‌ నుంచి తొలగించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ దీనిపై ప్రకటన చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని, తమ చిత్రం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది.