Shooting spot : ఏ హీరో ఏం చేస్తున్నాడో అప్డేట్ కావాలి..

అప్డేట్ కావాలి.. తరచూ అభిమానుల నుంచి వినిపించే ప్రశ్న. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. తమ అభిమాన హీరోతో సినిమా చేస్తున్న మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ అప్డేట్ ఇవ్వాలని కోరుతుంటారు.

అప్డేట్ కావాలి.. తరచూ అభిమానుల నుంచి వినిపించే ప్రశ్న. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. తమ అభిమాన హీరోతో సినిమా చేస్తున్న మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ అప్డేట్ ఇవ్వాలని కోరుతుంటారు. బయట ఎక్కడైనా ఫంక్షన్లలో కనిపించినా సరే.. అప్డేట్ ఇవ్వండి అని మొత్తుకుంటారు. అవునూ.. తమ అభిమాన హీరోలు ఏం చేస్తున్నారనే విషయంపై వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతూననే ఉంటారు. షూటింగ్స్‌లో ఉంటే టీజర్ ఎప్పుడనో.. ఖాళీగా ఉంటే కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతారనో ప్రశ్నలు వేస్తుంటారు. లేటెస్ట్ గా అప్‌డేట్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ తమ హీరోలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) మోస్ట్ అవెయిటెడ్ మూవీ కల్కి (Kalki). ఈ మూవీ అప్డేట్ ఏంటంటే.. ప్రస్తుతం షూటింగ్ శంకర్ పల్లిలో జరుగుతోంది. మే 9 ఈ సినిమా విడుదల ఉండటంతో.. షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అని అభిమానుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరో యంగ్ హీరో శర్వానంద్‌ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా మణికొండ డాలర్‌ హిల్స్ లో జరుగుతోంది. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతోందని అంటుండటంతో.. క్యూరియాసిటీ నెలకొంది.

ఇక మెగాస్టార్ విశ్వంభర (Vishwambhara) మూవీ విషయానికి వస్తే.. లాస్ట్ వీక్‌ సీక్వెన్స్ ని కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా ప్రజెంట్ ముచ్చింతల్‌లో షూటింగ్‌ జరుపుకుంటోందీ . లోకేషన్ కు చిరంజీవితో పాటు త్రిష కూడా షూటింగ్‌కి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. విష్ణు మంచు కన్నప్ప సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మధ్య మాస్‌ జాతర చేసుకుంది పుష్ప2 యూనిట్‌. ఇప్పుడు ఆర్ఎఫ్‌సీలో స్పీడుగా జరుగుతున్న ఫైనల్‌ షూటింగ్‌ లో పార్టిసిపేట్‌ చేస్తోంది.రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న మిస్టర్‌ బచ్చన్‌.

ఈ సినిమా షూటింగ్‌ లక్నోలోనే కంటిన్యూ అవుతోంది. మొన్నటివరకు దేవర షూటింగ్‌లో ఉన్న తారక్‌ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ హృతిక్‌తో కలిసి వార్‌2 సెట్‌లో స్టెప్పులేస్తున్నారు. నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్‌ హుడ్‌ మొయినాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్‌. ఈ సినిమా షూటింగ్‌ బీహెచ్ఈఎల్‌లో జరుగుతోంది. ఇవీ టాలీవుడ్ హీరోల సినిమాల తాజా అప్డేట్లు.