Salar : సలార్ 2 కి ఆల్ సెట్ చేసిన నీల్..

పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashant Neil) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’..

 

 

పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashant Neil) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’.. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో దీని రెండోభాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ “సలార్ శౌర్యంగపర్వం” ని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసే శారు. అయితే ఈ సినిమా మొదట్లో కాస్ట్ లేట్ గా స్టార్ట్ అవుతుంది అని టాక్ వచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇస్తోంది.

లాంగ్ గ్యాప్ తర్వాత ‘సలార్’ (Salaar) సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ప్రబాస్. ఆ ఉత్సాహంతోనే వరుసగా నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టేశాడు. ఒక్కొక్కటిగా వాటిని పూర్తి చేస్తూ వస్తున్నాడు కూడా.. ఇక ఇప్పుడు ఈ ‘సలార్’ సినిమాకి సీక్వేల్ విషయమై తాజాగా ఓ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.. శౌర్యంగ పర్వం నేపథ్యంలో రూపొందబోయే ఈ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్టు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. డైలాగ్స్ నుంచీ నెరేషన్ అంతా సిద్ధమయపోయిందంటూ ఓ టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రం ఈ మే నెల నుంచే మొదలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు లేటెస్ట్ న్యూస్ బట్టి తెలుస్తోంది. దీంతో.. మరోసారి పాన్ ఇండియా వైడ్ సలార్ విధ్వంసానికి అంతా సెట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ రచ్చ మొదలు పెట్టేసారు. ఆల్రెడీ పార్ట్ 2 సంబంధించి కొంతమేర షూట్ మేకర్స్ కంప్లీట్ చేశారు. త్వరలోనే ప్రబాస్ అండ్ టీమ్‌తో చర్చలు జరిపి ప్రశాంత్ నీల్ ఈ సినిమాని పట్టాలెక్కించేయనున్నాడనీ తెలుస్తోంది. మరి.. సలార్ పార్ట్‌-1 తో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించిన ప్రభాస్.. పార్ట్‌-2తో ఇంకెంత పెను విధ్వంసం సృష్టిస్తాడో చూడాల్సిందే..