NETFLIX CEO: నెట్‌‌ఫ్లిక్స్‌ సీఈవో పర్యటన.. అసలు రహస్యం వీడింది.. మెగా రీజన్..

టాలీవుడ్‌లో బడా హీరోలందరినీ టెడ్ సరండోస్ ఎందుకు కలుస్తున్నట్లు..? ఇంతకి ఏం జరుగుతోందని నిన్నటి నుంచి సోషల్ మీడియలో ఒకటే పుకార్లు షికారు చేశాయి. ఐతే ఇక్కడ కొన్ని లాజిక్స్ పరంగా చూస్తే తారక్, చెర్రీని నెట్‌ఫ్లిక్స్ సీఈవో కలిశాడంటే అర్ధం ఉంది.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 06:06 PM IST

NETFLIX CEO: నెట్‌ఫ్లిక్స్ అంటేనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నెంబర్ వన్ పొజీషన్‌లో ఉన్న డిజిటల్ సంస్థ. అలాంటి సంస్థ సీఈవో టెడ్ సరండోస్ సడన్‌గా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిశాడు. తర్వాత ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేశాడు. సాయంత్ర తీరిగ్గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో మహేశ్‌తో పాటు త్రివిక్రమ్‌ను కలిశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్ వంటి తారల్ని కూడా కలిసినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా టాలీవుడ్‌లో బడా హీరోలందరినీ టెడ్ సరండోస్ ఎందుకు కలుస్తున్నట్లు..?

SAI PALLAVI: మళ్లీ సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అనేస్తున్నారా..?

ఇంతకి ఏం జరుగుతోందని నిన్నటి నుంచి సోషల్ మీడియలో ఒకటే పుకార్లు షికారు చేశాయి. ఐతే ఇక్కడ కొన్ని లాజిక్స్ పరంగా చూస్తే తారక్, చెర్రీని నెట్‌ఫ్లిక్స్ సీఈవో కలిశాడంటే అర్ధం ఉంది. ఎందుకంటే త్రిబుల్ ఆర్‌కి గ్లోబల్‌గా గుర్తింపు దక్కింది. రాజమౌళి ప్రోత్సాహం వల్ల నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా త్రిబుల్ ఆర్‌కి ఆస్కార్ వచ్చేలా చాలా వరకు ప్రచారం చేసింది. ఆస్కార్ ఓటింగ్‌లో మంచి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పనిచేసింది. అలా చూస్తే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‌ని నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ కలిశాడనుకోవచ్చు. కాని చిరు, మహేశ్‌ని కలవటం ఏంటి..? ఎక్కడా వాళ్ల మూవీ గ్లోబల్‌గా రాలేదు. అయినా వీళ్లను కలిశాడంటే నిజంగా విశేషం ఏదైనా ఉందా..? ఆ ప్రశ్నకే ఆన్సర్ దొరికింది. వశిష్ట మేకింగ్‌లో చిరు చేస్తున్న విశ్వంభర ఇంగ్లీష్ వర్షన్ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందట.

దాని రైట్స్ డీల్ కుదుర్చుకున్న టెడ్.. ఆతర్వాత మహేశ్‌ని కలవటానికి కారణం కూడా రాజమౌళినే అని తెలుస్తోంది. ఆల్రెడీ గుంటూరు కారం ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకోవటం, అలానే మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమా నిర్మాణ భాగస్వామ్యం నెట్‌ఫ్లిక్స్ కూడా తీసుకోవటం వల్ల.. సూపర్ స్టార్‌ని కలిశాడట టెడ్. ఇదీ.. చిరు, మహేశ్‌ని నెట్‌ఫ్లిక్స్ సీఈవో కలవటం వెనకున్న కహానీ.