Niharika Konidela: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ మధ్య విబేధాలు వచ్చాయా? నిహారిక విడాకులు తీసుకుంటోందా? చాలాకాలంగా మీడియాలో ఇలా కథనాలు వస్తున్నా.. మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు.
అయితే, సోషల్ మీడియాలో నిహారిక, చైతన్య చేసిన పనులు చూస్తుంటే ఇద్దరికీ విడాకులు ఖాయమనిపిస్తోంది. నిహారిక, చైతన్య పెళ్లి 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ అందరూ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి ముందు కూడా నిహారిక సోషల్ మీడియాలో యమా యాక్టీవ్‌గా వుండేది. పెళ్లి తర్వాత ఎప్పటికప్పుడు భర్తకు సంబంధించిన కబుర్లు పంచుకునేది. వీళ్ల సోషల్ మీడియా ఫొటోలు చూస్తుంటే ఎంతో చక్కగా, అన్యోన్యంగా వుంటున్నారనిపించేది. అయితే, వీరి మధ్య కూడా మనస్పర్ధలు తప్పలేదు. రెండేళ్లపాటు బాగానే వున్నా, కొంతకాలంగా మనస్పర్దలు చోటుచేసుకున్నాయని తెలిసింది. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది.
దీనికి తగ్గట్టే ముందుగా చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా, పెళ్లి ఫొటోలన్ని డిలీట్ చేశాడు. భర్త బాటలోనే నిహారిక కూడా చైతన్యను అన్‌ఫాలో చేసింది. చైతన్యతో దిగిన ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలిగించింది. ఇలా సోషల్‌మీడియాలో డిలీట్ అయిన ఫొటోలు, పోస్టులను బట్టి ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పటికే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పి ‘ముద్దపప్పు ఆవకాయ’తో నిర్మాతగా మారిన నిహారిక 2015లోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌ను స్టార్ట్ చేసింది.
రీసెంట్‌గా మరో ముందడుగు వేసి ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ కలను నిజం చేసుకున్న నిహారిక, అక్కడ పూజాకార్యక్రమాలు జరిగిన వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. నిహారిక కాపురాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయట. దీంతో మరో మార్గం లేదని కుటుంబ సభ్యులు కూడా ఒక నిర్ణయానికొచ్చేశారని తెలుస్తోంది.