Nikhil Siddarth: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న స్పై టీజర్‌.. సినిమాలో అంతా నిజమే చూపిస్తారా ?

కార్తికేయ 2 హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ సూపర్ జోష్ మీద కనిపిస్తున్నాయ్. ఆ తర్వాత వచ్చిన 18 పేజీస్‌కు పాజిటివ్ రావడంతో.. తర్వాత మూవీ స్పై మీద అంచనాలు పెరిగాయ్. నిజానికి థ్రిల్లర్స్ ఎప్పుడూ నిఖిల్‌కు బ్యాక్‌బోన్‌గా నిలిచాయ్. పడిపోయిన ప్రతీసారి హీరోగా నిఖిల్‌ను నిలబెట్టింది ఆ సినిమాలే ! అప్పట్లో స్వామి రారా కావొచ్చు.. ఆ తర్వాత కార్తికేయ కావొచ్చు.. నిన్నటి కార్తికేయ 2 కావొచ్చు. థ్రిల్లింగ్ స్టార్ అయిపోయాడు నిఖిల్.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 06:09 PM IST

అలాంటి హీరో నుంచి వస్తున్న మూవీనే స్పై ! ఇప్పటికే గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో నేషనల్ థ్రిల్లర్ అంటూ మూవీని ప్రమోట్ చేశారు. భారత్ దాచి ఉంచిన అతిపెద్ద సీక్రెట్ సుభాష్ చంద్రబోస్ గురించి ఈ మూవీ ఉంటుందని ప్రకటించారు. బోసు నినాదమైన మీరు నాకు రక్తమివ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అనే మాటలను లోగోపై ముద్రించి ఉంటుంది. గ్లింప్స్ అదుర్స్ అనిపిస్తే.. టీజర్ అంతకుమించి అనిపించింది. టీజర్ ఓపెన్‌ చేయగానే.. భారతదేశం దాచిపెట్టిన రహస్యం అంటూ తన శిష్యులకు మార్కాండ్ దేశ్‌పాండే చెప్తుంటారు. ఒకరకంగా సుభాష్ చంద్రబోస్‌ చనిపోవడానికి ముందు దాచిపెట్టిన ఫైల్స్ గురించి.. కలిసిన మనుషుల గురించి సెర్చింగ్ ఆపరేషనే మూవీ కాన్సెప్ట్ అన్నది క్లియర్‌గా అర్థం అవుతోంది.

సుభాష్ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో చనిపోలేదని.. అదంతా ఓ కవరప్‌ స్టోరీ అని చెప్పడంతో.. సినిమాలో ఏం చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. టీజర్‌లో ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా కనిపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు కొదువే లేదు అనిపించింది టీజర్ చూస్తుంటే ! డాషింగ్‌ లుక్‌లో నిఖిల్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాడు. మరి స్టోరీ ఫిక్షనా.. నిజంగా నిజాల చుట్టూ సినిమా తిరుగుతుందా.. సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఎలాంటి సీక్రెట్స్‌ రివీల్‌ చేస్తారన్న ఆసక్తి క్రియేట్ చేయగలిగారు కానీ.. ట్రీట్‌మెంట్‌ కాస్త అటు ఇటు అయినా.. మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో సినిమా మీద రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయ్. జూన్‌ 29న రిలీజ్‌ కాబోతున్న ఈ మూవీని.. గ్యారీ డైరెక్ట్ చేస్తుండగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్‌.. శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాకు మరో ప్లస్ కాబోతోంది. టీజర్‌ చివర్లో నేతాజీ స్లోగన్స్‌ను యూజ్‌ చేసుకున్న తీరు.. గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.