Nita Ambani: అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రి వెడ్డింగ్ వేడుకలో ఎంత మంది అతిథులున్నా.. నీతా అంబానీకి మాత్రం సరిరారు అన్నట్లుగా ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా నీతా అంబానీ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్, మేకప్.. ఇలా ప్రతీదీ ఆమెను చాలా స్పెషల్‌గా నిలబెట్టింది. మూడు రోజుల వేడుక అంతా తనదే అన్నట్లుగా.. అంతా తానై నీతా సందడి చేశారు.
Janhvi Kapoor: బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ చెప్పిండు.. చెర్రీ తీసుకుండు..
ఒక్క మాటలో చెప్పాలంటే కాబోయే వధూవరులు అనంత్-రాధికాలను మించి అందరి అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకున్నారు నీతా అంబానీ. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో నీతా అంబానీ ఆరు ప్రత్యేకమైన లుక్స్‌తో వావ్ అనిపించారు. ముఖ్యంగా నీతా అంబానీ చీర బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడీషన్ జర్దోసీ వర్క్.. బ్లౌజ్ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్ అందమైన మేకప్‌తో మరింత అందంగా ముస్తాబైన విధానం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక.. కాక్ టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్ మేడ్ గౌను.. క్లాసిక్ ప్రెంచ్ ట్విస్ట్ బన్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించి.. ఎంత మంది అందగత్తెలు ఉన్నా నీతా లుక్స్ ముందు ఎంతా అనిపించారు. వీటన్నింటిని మించి అపరకుబేరుడి భార్య హోదాలో నీతా అంబానీ తమ ఐడెంటిటీని నెక్లెస్ రూపంలో చాటిచెప్పారనే చెప్పాలి. తమ హోదాకి ఏమాత్రం తగ్గకుండా ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి.. ఏకంగా ప్రపంచమే ఆమె కోసం మాట్లాడుకునేలా చేసారు. దీని ధర నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఉంటుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వచ్చిన గెస్ట్‌లు సహా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇప్పుడు నీతా ధరించిన నెక్లెస్ గురించే మాట్లాడుకుంటున్నారంటే.. ఆ న్లెక్లెస్తో ఆమె ఎంత మ్యాజిక్ చేశారో అర్థమవుతుంది. ఇక.. ప్రి వెడ్డింగ్ వేడుకలను ‘హస్తాక్షర్’తో ముగింపు పలికారు.
ఈ వేడుకల్లో భాగంగా నీతా అంబానీ ‘విశ్వంభరి స్తుతి’ పేరిట చేసిన నృత్య ప్రదర్శనతో అతిథులను అలరించారు. కాబోయే భార్యాభర్తలకు అమ్మవారి ఆశీస్సులను కోరుతూ ఆ నాట్యం చేశారు. మనవరాళ్లు ఆదియా శక్తి, వేదకు అంకితం చేశారు. బేసిక్‌గానే నీతా అంబానీ గొప్ప డాన్సర్. అలాంటి డాన్సర్ చాలా కాలం తర్వాత మళ్లీ తనయుడి వేడుకలో ఇలా అద్భుతంగా నృత్యం చేయడం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నీతా అంబానీ సంప్రదాయ కాంచీపురం చీరను ధరించారు. నీతా భారతదేశంలోని ప్రసిద్ధ దక్షిణ భారత కాంచీపురం చీరను ఎంచుకోవటం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మొత్తానికి తన ముద్దుల కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలను అంతా తానై నడిపించిన నీతా అంబానీ.. తమ ఆతిథ్యంతో పాటు తన తన ఐకానిక్ సిగ్నేచర్ మేకప్ అండ్ లుక్స్‌తో నీతా ది క్వీన్ అనిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు.