Nitin Chandrakant: ఇండస్ట్రీలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెలుగుచూస్తున్నాయ్. సీనియర్ నటుడు శరత్ బాబు, సంగీత దర్శకుడు రాజ్.. చిరంజీవిని హీరోగా పరిచయం చేసిన వాసు, ట్రిపులార్‌ నటుడు స్టీవెన్‌సన్ అనారోగ్యంతో చనిపోయారు.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 01:26 PM IST

ఈ ఘటనల నుంచి బయటకు రాకముందే.. మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర కజ్రాత్‌లోని తన స్టూడియోలో ఆయన ఉరి వేసుకున్నారు. పోలీసులు ఆయన మరణంపై విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ప్రస్తుతానికి తెలియలేదు. 1987లో దూరదర్శన్‌లో తమస్ సీరియల్‌తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన చంద్రకాంత్‌ దేశాయ్‌.. చాలా సీరియళ్లకు పనిచేశారు.

శ్యాంబెనగళ్ భారత్ ఏక్ కోజ్, కోరా కాగజ్, స్వాభిమాన్ సీరియల్స్ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయ్. ఆ తర్వాత దూరదర్శన్‌లో పలు సీరియల్స్‌కు పనిచేశారు. చాణక్య సీరియల్‌తో ఈయన ఆర్ట్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హద్ దిల్ దే చుకే సనమ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత లగాన్, దేవ్‌దాస్, స్వదేశ్ , జోదా అక్బర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, లగే రహో మున్నాభాయ్ వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన మొత్తం నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు.