ఎన్టీఆర్ దొరికే ఛాన్స్ లేదు, స్టార్ డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బిజీ అయిపోయాడు. వరుస ప్రాజెక్ట్ లతో ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేసి మరో రెండు సినిమాలతో బిజీ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 05:02 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బిజీ అయిపోయాడు. వరుస ప్రాజెక్ట్ లతో ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేసి మరో రెండు సినిమాలతో బిజీ అయ్యాడు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ జరగాల్సి ఉంది. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను ఒక షిప్ లో ప్లాన్ చేయగా ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడని టాక్.

ఇలా మరో అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నాడు. అగ్ర దర్శకులకు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అసలు దొరకడం లేదు. దీనిపై యువ దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడో ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య అనే సినిమాను హరీష్ శంకర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీనితో ఎన్టీఆర్ తో ఎలా అయినా సూపర్ హిట్ సినిమా చేస్తా అంటూ హరీష్ శంకర్ ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ను విలేఖరి ఇదే ప్రశ్న అడిగాడు. ఎప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు అని.

దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ… ఎన్టీఆర్ కోసం మొత్తం స్క్రిప్ట్ రెడీగా లేదు కానీ ఒక లైన్ అయితే రెడీగా ఉంది అన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ లైనప్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే అన్నాడు హరీష్ శంకర్. అలానే జూ ఎన్టీఆర్ లైనప్ కూడా నాకు తెలుసు అన్నాడు. కనుక ఇప్పట్లో ఆయన్ను అప్రోచ్ అవ్వడం సాధ్యం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. నువ్వు అడిగిన ప్రశ్నకి చాలా నిజాయితీగా ఆన్సర్ ఇస్తున్నాను అన్నాడు హరీష్ శంకర్.