రామ్ చరణ్ తేజ్ తో అవార్డులు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాయా? 2009 నుంచి 2023 వరకు అంటే ఆల్ మోస్ట్ 14 ఏళ్లలో మూడు సార్లు చెర్రీని అవార్డుల విషయంలో బ్యాడ్ లక్ బాదేసింది. బాదేస్తూనే ఉంది. నిజానికి త్రిబుల్ఆర్ కే రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంటాడనున్నారు. కాని కథ అడ్డం తిరింది. అసలు పోటీ అంతా చెర్రీ, తారక్ మధ్యే అనుకుంటే, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ బన్నీకి దక్కింది. విచిత్రం ఏంటేంటే ఇది రామ్ చరణ్ కి కొత్తకాదు. నిజానికి గతంలోనే మెగా పవర్ స్టార్ కి నేషనల్ అవార్డు రావాల్సింది. కాని కొద్దిలో మిస్ అయ్యింది. 2018 లో విడుదలైన రంగస్థలం మూవీకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవాలి చరణ్. అంతగా పెర్పామెన్స్ లో పీక్స్ చూపించాడు ఈ హీరో
కాని ఏమైంది అప్పుడు చరణ్ కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ మిస్ అయ్యింది. అంతకుముందు మగధీరకి కూడా ఇదే జరిగింది. చిరుత హిట్ తర్వాత 2009 లో మగధీరతో టాప్ స్టార్ గా మారాడు చెర్రీ.కాని ఏమైంది మేస్త్రీ లో దాసరి బాగా నటించాడని నందీని అటు సమర్పించారు. దీంతో మగధీరుడికి నంది కూడా మిస్ అయ్యింది. ఇలా ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేసినప్పుడల్లా తనకి అవార్డు రావటానికి అన్ని అర్హతలున్నా అవార్డులు మాత్రం మిస్ అవుతూనే ఉన్నాయి. బ్యాడ్ లక్ బాదుతూనే ఉంది.