Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో 11వ వారం గరంగరంగా సాగుతోంది. నామినేషన్ల ప్రాసెస్‌తోనే మంటపుట్టించాడు బిగ్ బాస్. గత రెండ్రోజులుగా జరుగుతున్న ప్రక్రియతో హౌస్ మొత్తం ఫైర్ మోడ్‌లోకి వచ్చేసింది. నచ్చని విషయాలను తలపై బాటిల్‌తో కొట్టి మరీ చెప్పారు. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత్ మొదలు పెట్టాడు. అర్జున్‌ను నామినేట్ చేశాడు. అయితే, ప్రశాంత్, అర్జున్ మధ్య చాలా సేపు మాటల యుద్ధం నడించింది. గేమ్ సరిగా ఆటడం లేదని సెకండ్ నామినేషన్‌గా రతికను నామినేట్ చేశాడు ప్రశాంత్.
Vaishnavi Chaitanya: పంట పండింది.. బేబీ బ్యూటీ కోటి దాటేసిందిగా..!
తర్వాత అశ్వినీ.. ప్రియాంకను, అమర్‌ను నామినేట్ చేసింది. పాట నచ్చలేదని అమర్‌ని నామినేట్ చేసి.. అందరికి తానే వంటచేస్తానని సవాల్ విసిరింది. కెప్టెన్సీని సరిగ్గా చేయలేదని యావర్.. శోభాశెట్టిని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో అమర్ ఆటతీరు నచ్చలేదని నామినేట్ చేశాడు. ఓ వైపు హాట్ హాట్‌గా సాగుతుండగానే.. అమర్ చెప్పడం మరిచిపోయా.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. తర్వాత శోభాశెట్టి యావర్, అశ్వినిని నామినేట్ చేసింది. శోభా, అశ్వినీ మధ్య మాటల యుద్ధం నడించింది. అమర్.. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యావర్‌ను నామినేట్ చేశాడు అమర్. యావర్, అమర్ నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం పీక్స్‌కు వెళ్లింది.
ఒకానొక టైంలో కొట్టుకునే స్థాయికి వెళ్లగా.. శివాజీ మధ్యలో వచ్చి ఇద్దరిని కంట్రోల్ చేశాడు. శివాజీ.. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈవారం ఇంటి నుంచి బయటకు పంపడానికి నామినేట్ అయిన సభ్యులు అమర్, ప్రియాంక, శోభాశెట్టి, యావర్, గౌతమ్, అర్జున్, రతికలు నిలిచారు. ఇక నామినేషన్ల ప్రాసెస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తర్వాత పడుకునే ముందు నామినేషన్ల గురించి గ్రూపులుగా విడిపోయి చర్చించుకున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగ్సాలిందే.