Leo: రజినీకాంత్ తర్వాత విజయ్‌కి డిస్ట్రిబ్యూటర్ల షాక్..!

సౌత్ సినిమాలు ఇక్కడ విడుదలైన నెలకే ఓటీటీలో దర్శనమివ్వటం కామన్. కాని ఓటీటీ రూల్స్ మాత్రం నార్త్‌లో గట్టిగా ఫాలో అవుతారు. అలా చూస్తే అక్కడ ఏ సినిమా అయినా థియేటర్స్‌లో 8 వారాలు ఆడాకే ఓటీటీలో రావాలి. లేదంటే అసలు సినిమా రిలీజ్‌నే ఆపేస్తారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 06:17 PM IST

Leo: జైలర్ మూవీ బ్లాక్ బస్టర్. కాని.. హిందీలో ఈ సినిమా ఫ్లాపైందని ఎవరికైనా తెలుసా. అంటే కథ బాలేదనో, మరొకటనో ఈ సినిమా హిందీలో ఫ్లాప్ కాలేదు. ఓటీటీ బ్యాచ్ ఇచ్చిన ఝలక్‌తో నార్త్‌లో హిట్ టాక్ వచ్చినా కూడా ప్లాపైంది. దానికి కారణం ఓటీటీ రూల్స్. అసలు విషయం ఏంటంటే.. సౌత్ సినిమాలు ఇక్కడ విడుదలైన నెలకే ఓటీటీలో దర్శనమివ్వటం కామన్. కాని ఓటీటీ రూల్స్ మాత్రం నార్త్‌లో గట్టిగా ఫాలో అవుతారు. అలా చూస్తే అక్కడ ఏ సినిమా అయినా థియేటర్స్‌లో 8 వారాలు ఆడాకే ఓటీటీలో రావాలి.

లేదంటే అసలు సినిమా రిలీజ్‌నే ఆపేస్తారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. కానీ, సౌత్ సినిమాలేవీ కూడా ఓటీటీ రూల్స్ ఫాలో కావట్లేదు. ఇంతకాలం ఓపిక పట్టిన నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్, సింగిల్ థియేటర్ ఓనర్స్.. జైలర్ విషయంలో పట్టుబిగించారు. అంతే.. ఈ సినిమా వచ్చిన నెలకే ఓటీటీలో జైలర్ సందడి చేశాడు. అంతే వెంటనే జైలర్‌ని నార్త్ థియేటర్స్ నుంచి తీసేశారు. అలాంటి పరిస్థితే లియోకి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా సేల్ అయ్యాయి. ఇది విడుదలైన 4 వారాలకే ఓటీటీలో వచ్చేటట్టైతే, ఈ మూవీని హిందీలో రిలీజ్ చేయబోమంటూ నార్త్ డిస్ట్రిబ్యూటర్లు తేల్చారు.

అదే జరిగితే, లియో నార్త్‌లో రిలీజ్ కాదు. అప్పుడు కనీసం రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వసూళ్ళకు గండి పడే ఛాన్స్ ఉంది. ఇదే విధానం ఇక్కడితోనే కాదు, ప్రభాస్, మహేశ్, పవన్ సినిమాలకు కూడా కొనసాగితే సీన్ రివర్సే.