దేవర సినీ సునామీ తర్వాత వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అది కూడా 50 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసి, ఆతర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ షూటింగ్ తో బిజీ అవుతాడు… ఆతర్వాత ఏంటనే ప్రశ్నకి ఆన్సర్ దేవర సీక్వెలే అని చాలా వరకు తేలింది. కాకపోతే, దేవర 2 విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం, కొరటాల శివని ఆలోచనల్లో పడేసిందని తెలుస్తోంది. దేవర లో ప్రశ్నలుగా మిగిలిపోయిన చాలా అంశాలు, దేవర 2 లో క్లియర్ గా తేలే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ బాహుబలి 2 విషయంలో రాజమౌళి చేసిన తప్పే దేవర 2 లో చేయకూడదని నిర్ణయం తీసేసుకుంది టీం. ఇంతకి బాహుబలి 2 లో రాజమౌళి, చేసిన తప్పేంటి? దేవర 2 లో అలాంటి తప్పు సరిదిద్దారంటే, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు…? ఇంకా ఇందులో ముగ్గరు ఎన్టీఆర్ లు కనిపించే ఛాన్స్ ఉందన్న ప్రచారం వెనకున్న అసలు నిజం ఏంటి?
దేవర క్రియేట్ చేసిన సునామీ నిజంగా కొరటాల శివ కూడా ఈరేంజ్ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేసి ఉండడు… త్రిబుల్ ఆర్ కంటే ముందే తన మాస్ మూవీల డబ్బింగ్ వర్షణ్ తో నార్త్ ఇండియా లో మాస్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, కేవలం తన ఇమేజ్ తోనే దేవర రేంజ్ ని శిఖరంగా మార్చాడు..
బాలీవుడ్ హీరోలు కూడా టచ్ చేయలేనంతగా నార్త్ ఇండియన్ మాస్ ఆడియన్స్ లోకి చొచ్చకుపోయాడు.. అలాంటి ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తూనే, ఆతర్వాత దేవర సీక్వెల్ కి రంగం సిద్ధం చేసుకున్నాడు. వార్ 2 పూర్తికాగానే, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ షూటింగ్ కంటిన్యూ అవుతుంది.
ప్యార్ లల్ గా అంటే సమ్మర్ నుంచి దేవర 2 సెట్స్ పైకెళ్లే అవకాశాలేఎక్కువ కనిపిస్తున్నాయి
నిజానికి 2025 ఇయర్ ఎండ్ కి దేవర 2 ని సెట్స్ పైకి తీసుకెళతారనే చర్చ జరిగింది. కాని సమ్మర్ కే సెట్స్ పైకెళ్లే అవకాశాలు దేవర 2 కి పుష్కలంగా ఉన్నాయి. ఇక దేవర లో మిస్ అయిన చాలా అంశాలు, తేలని ప్రశ్నలకు దేవర 2లో సమాధానాలు ఎలా ఉంటాయో రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. కాని ముచ్చటగా మూడు విషయాలు మాత్రం ముందే తేలాయి.
అందులో మొదటి అంశం, బాహుబలి 2 విషయంలో రాజమౌళి చేసిన తప్పు కొరటాల శివ చేయకూడదని. ఆ తప్పంటేంటే, బాహుబలి 1, బాహుబలి 2 లో ఇద్దరు ప్రభాస్ లు కనిపిస్తారు. ఒకరు తండ్రి ఒకరు కొడుకు… కాని ఒకరిని ఒకరు కలిసే ఛాన్స్ ఉండదు… విచిత్రం ఏంటంటే
విక్రమ దేవుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి… ఈ మూడు పాత్రల్లో ప్రభాసే కనిపించాడు. విక్రమ్ దేవుడిగా గోడమీద ఫోటోలో ఒక పాత్ర, కట్టప్ప చేతిలో వెన్నుపోటుకి గురైన అమరేంద్ర బాహుబలిగా ఒక పాత్ర, ఇక శివుడిగా పెరిగిన మహేంద్ర బాహుబలిగా మరో పాత్రలో ప్రబాస్ కనిపించాడు. అచ్చంగా దేవరకి ఇదే సూత్రం ఫాలో అయినట్టున్నాడు కొరటాల శివ.
దేవర, వర ఇద్దరినే చూపించిన కొరటాల కనిపించని మరో పాత్రని దేవర 2 లో చూపించబోతున్నాడు. అలాంటి పాత్ర తాలూకు హింట్ లేదు. కాని దేవర 2 కథే మూడో ఎన్టీఆర్ పాత్రతో పూనకాలు తెప్పించాలనే ప్రయత్నం జరుుగుతోంది. ఆల్రెడీ దేవర 2 షూటిగ్ దేవర పూర్తయ్యే టైంలోనే కొంత చేయటం వల్ల ఈ విషయం ఆల్ మోస్ట్ బయటికి పొక్కింది…
ఇక్కడ దేవర, వర పాత్రలని చూపించి, మరో పాత్రని గోడమీద ఫోటోకి పరిమితం చేయకూడదనే నిర్ణయం దేవర టీం తీసుకుందట. అంతేకాదు, దేవరని నిజానికి వర చంపలేదనే డౌట్ చాలా మంది లో ఉంది… దెవరని ఎవరో చంపితే, దిగిన కత్తి వర తీసుంటాడనేది కామన్ ఆడియన్స్ డౌట్… ఆ డౌట్
కి సాలిడ్ ఆన్సరే దేవర 2 ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉండబోతోంది. ఈరెండు గోస్ట్ రైటర్స్ టంగ్ స్లిప్ అవటం వల్లే గుసగుసల రూపంలో బయటికి పొక్కాయని తెలుస్తోంది. ఇక మూడో అంశం, విలన్ సైఫ్ ఆలీ ఖాన్ పాత్రకి, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకి మధ్యఉన్న సంబంధం, దేవర 2 లో బిగ్గెస్ట్ ట్విస్ట్ గా మారబోతోందట. నిజంగా ఈ మూడు అంశాలు దేవర 2 ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లే ఛాన్స్ఉంది.
దేవరగా తారక్ కనిపిస్తే, వర మాత్రం పిల్లాడిగా సినిమాలో కనిపిస్తాడు.. కాని ఎక్కడా ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉండరు. కారణం వర చిన్నతనంలోనే దేవర చనిపోవటం…బాహుబలి లో కూడా ఇలానే జరిగింది. అందుకే దేవర 2 లో వర, దేవరలే కాదు, మూడో ఎన్టీఆర్ పాత్ర కూడాకలుసుకునే సర్ ప్రైజులు భారీగా పెట్టి, మాస్ మటిపోగెట్టే పనిలో ఉణ్నాడు కొరటాలా. ఆ కాన్పిడెన్స్ తోనే దేవర అసలు కథ 90 శాతం దేవర 2 లోనే ఉందన్నాడు.