మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఏమాత్రం జాలి, దయా లేదని దేవర రిలీజ్ అయ్యాకే తేలింది. ఎంతో సౌమ్యుడు, అందరి వాడనిపించుకున్న డార్లింగ్ కి కూడా కల్కీ విషయంలో ఏమాత్రం జాలి కనిపించలేదు. ఈ ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్ మీద పగతో విరుచుకుపడ్డారు. వసూళ్ల సునామీ తెచ్చారు. ఇది ఫ్యాన్స్ కి, దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకి కూడా గొప్ప విషయమే… ఎటొచ్చి, బాలీవుడ్ దర్శక నిర్మాతలకు, హీరోలకు మాత్రం తెలుగు హీరోలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ కల్కీ వచ్చి 1200 కోట్ల సునామీ తెస్తే, తన కూడా థౌజెండ్ వాలానే అని అన్నాడు దేవర. ఇప్పుడు పుష్ప 2 వస్తోంది.. ఇదే హిందీ హీరోలని, అక్కడి దర్శక నిర్మాతలను వణికించేస్తోంది. మన వాల్లు ఈజీగా 500 కోట్లు, వెయ్యికోట్లు అంటూ వసూళ్ల వరదలు తెస్తుంటే, అక్కడ 200 కోట్లు, 400 కోట్ల వసూళ్లు రాబట్టే హీరోనే కరువయ్యాడు. అలాంటి సిచ్చువేషన్ లో కల్కీ, దేవర తర్వాత పుష్ప కూడా కనికరం చూపించకపోతే, వాళ్లకి పీడకలలు తప్ప మరో ఛాన్స్ లేదు. కాని తప్పేలా లేదు.
తెలుగు హీరోలకి, తెలుగు దర్శక నిర్మాతలకి ఏమాత్రం జాలి దయా కరుణ్ లేవంటున్నారు హిందీ స్టార్లు. హిందీ దర్శక నిర్మాతలు.. మరీ రెండు మూడు నెల్లకో పాన్ ఇండియా మూవీని వదిలి నార్త్ ఇండియాలో బాలీవుడ్ మార్కెట్టే లేకుండా చేసేస్తున్నారనేది వాళ్ల మేయిన్ కంప్లైంట్
ఈ ఏడాది జూన్ లో కల్కీ మూవీ వచ్చింది. 1200 కోట్ల సినీ సునామీ క్రియేట్ చేసింది. అదొచ్చిన మూడు నెల్లకే సెప్టెంబర్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర వచ్చింది. వసూళ్ల సునామీ కంటిన్యూ అయ్యింది. జిగ్రాలాంటి హిందీ సినిమాలు, వెట్టయాన్ లాంటి తమిళ సినిమాలు కూడా కొట్టుకుపోయేలా దేవర దండయాత్ర కొనసాగింది
కట్ చేస్తే ఇప్పుడు సీన్ లోకి పుష్పరాజ్ వస్తున్నాడు. డిసెంబర్ 5కి వరల్డ్ వైడ్ గా దాడి చేయబోతున్నాడు. అది కూడా 11500 థియేటర్స్ లో… ఈలోపే కోలీవుడ్ స్టార్ సూర్య కంగువతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసుకున్నాడు. తనెంత వరకు నార్త్ మార్కెట్ ని శాసిస్తాడో డౌటే …కాని పుష్ప 2 మాత్రం ఈజీగా నార్త్ ఇండియాలో జెండా ఎగరేసే ఛాన్స్ ఉంది
అసలు ఈ ఏడాది స్త్రీ 2 రాకపోతే, బాలీవుడ్ లో సినిమాలు తీస్తారనే విషయమే హిందీ జనం మర్చిపోయే పరిస్థితి.. వింటానికి ఇది మరీ టూమచ్ స్టేట్ మెంట్ లా అనిపిస్తుంది. కాని ఈ ఏడాది బాలీవుడ్ లో ఆహా అనిపించే సినిమా ఏదైనా వచ్చిందా అంటే, అక్కడి వాల్లుకూడా కల్కీ, దేవర పేర్లే చెబుతారు
కాని ఇవి హిందీ మూవీలు కాదు.. తెలుగుసినిమాలంటే నార్త్ వాళ్లు కాదనే పరిస్థితిలేదు. అంతగా మన మూవీలను వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు. వాళ్లకు కావాల్సిన మాస్ కంటెంట్ ని తెలుగు హీరోలు ఇస్తున్నారు. అంతవరకు బానే ఉంది. జిగ్రా ఫ్లాప్ తర్వాత బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఏకంగా తన నిర్మాణ సంస్థలో 50 శాతం వాటా అమ్మేశాడు
చాలా వరకు హిందీ నిర్మాతలు దివాలా తీస్తున్నారు. ఇలా వాళ్ల పరిస్థితి ఏడాది కేడాది దిగజారుతోంది. ఇలాంటి టైంలో లాస్ట్ ఇయర్ సలార్, ఈఏడాది కల్కీతో రెబల్ స్టార్ సౌత్ నార్త్ మార్కెట్ ని షేక్ చేస్తే, వెంటనే సీన్ లోకి వచ్చిన దేవర అదేరేంజ్ లో పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేశాడు. ఇంకా దూసుకెళుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరుహీరోలకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోడైతే, ఒకే ఏడాది మూడు పాన్ ఇండియా పంచులని బాలీవుడ్ తట్టుకోవటం కష్టమే… అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లకి పండగనే కాని, బాలీవుడ్ కి మాత్రం తెలుగు పాన్ ఇండియా హిట్స్ వల్ల రక్తకన్నీరు తప్పట్లేదు.