మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. దేవరతో సోలోగా పాన్ ఇండియాని షేక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. రెండు సార్లు థౌఝెండ్ వాలాలు పేల్చాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నమాటని సౌత్ లోనే కాదు నార్త్ మార్కెట్ లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకాం తను కొత్తగా ఏం చేయాలి…కొండల్ని వంచాలా? శిఖరాలు ఎక్కాలా..? ఈ డౌట్లు రావటానికి, కారణం తన మీద మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెరగటమే… దేవర తర్వాత ఆల్రెడీ వార్ 2 మూవీ చేస్తున్నాడు. ఆవెంటనే డ్రాగన్ గా మారబోతున్నాడు. ఇలాంటి టైంలో సౌత్ ఇండియన్ హీరోలెవ్వరు చేయని పని చేసి చరిత్ర స్రుష్టించబోతున్నాడు. ఆల్రెడీ ఆమిర్ ఖాన్ స్టార్ అంటే ఏంటో ఎన్టీఆర్ ని చూపించి పరోక్షంగా డెఫినేషన్ చెబితే, ఇప్పుడు తను మాస్ స్టార్ కి డెఫినేషన్ గా మారేలా ఉన్నాడు. బన్నీ, చరణ్, ప్రభాస్ కూడా చేయని పని చేసి హిస్టరీ రీసౌండ్ చేసేలా చేస్తున్నాడు.
ఎన్టీఆర్ ఇప్పుడంటే దేవర, త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియాని షేక్ చేశాడు కాని, ఇలాంటి షాకులు టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త కాదు. ఇంకా మీసాలు రాకముందే బాలరామాయణాన్ని, నూనూగు మీసాలతో ఆది, సింహాద్రి లాంటి ట్రెండ్ సెట్టర్స్ ని వదిలాడు. మరీ టీనేజ్ లోనే ఊర మాస్ ఇమేజ్ తో కోట్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు
ఇప్పుడు త్రిబుల్ ఆర్, దేవరతో పాన్ ఇండియా లెవల్లో మాస్ ఫ్యాన్ బేస్ ని విపరీతంగా పెంచుకున్నతను, ఈ సారి అంతకుమించే రిస్క్ చేస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ని నార్త్ మార్కెట్ లో మించేలా ఉన్నాడు. ఎందుకు ప్రభాస్ తోపోల్చాల్సి వస్తోందంటే, ప్రజెంట్ పాన్ ఇండియా కి ఉన్న ఒకే ఒక్క కింగ్ ప్రభాసే
బాహుబలి, బాహుబలి2, సాహో, సలార్, కల్కీ ఇలా 5 పాన్ ఇండియా హిట్లతో 6 వేల కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన ఏకైక ఇండియన్ స్టార్ ప్రభాస్. తన తర్వాత ఆరేంజ్ లో పాన్ ఇండియా కింగ్ అనిపించుకోగలిగింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే.. ఎందుకంటే కేజీయఫ్ 2 తో ఒకసారి వెయ్యికోట్లని రీచైన యశ్, త్రిబుల్ ఆర్ తో 1200 కోట్లని తారక్ తోకలిసి టచ్ చేసిన చరణ్, ఇంతవరకు 1000 కోట్లు టచ్ చేయని బన్నీ, వీల్లందరితో పోలిస్తే, వరుసగా రెండు పాన్ ఇండియా మాస్ హిట్లు సొంతం చేసుకున్నాడు తారక్
ఇప్పుడు వార్ 2 తో పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ కి రెడీ అయ్యాడు. అయితే వార్ 2 మూవీనే ఎన్టీఆర్ ని మిగతా స్టార్స్ తోపోలిస్తే ప్రత్యేకంగా మారుస్తోంది. ప్రభాస్ ఇంతవరకు హిందీ మూవీ చేయలేదు. కాని హిందీలో తన సినిమాలొస్తున్నాయి. మహేశ్ బాబు బాలీవుడ్ వెళ్లలేదు. చరణ్ వెళ్లినా తను చేసిన జంజీర్ రీమేక్ షాక్ ఇచ్చింది. బన్నీ కూడా పాన్ ఇండియాలెవల్లో పుష్పరాజ్ అనిపించుకున్నాడు. కాని బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదు.
పాన్ ఇండియా హిట్లున్న హీరోలు, పాన్ ఇండియ సినిమాలు చేస్తున్న స్టార్స్ ఎవరూ ఎన్టీఆర్ లా డైరెక్ట్ హిందీ మూవీ చేయట్లేదు. అందులో కూడా హ్రితిక్ లాంటి కటౌట్ ఉణ్నా అందరి అటెన్షన్ ఎన్టీఆర్ వైపు మల్లేలా విలనిజంలో హీరోయిజం చూపించబోతున్నాడు.. అదే తనని మరో శిఖరం మీదకు ఎక్కించేలా ఉంది
ధూమ్ సీరీస్ లో హీరో పోలీస్.. కాని విలన్ దొంగ.. నిజానికి ఆ దొంగే అసలు హీరోగా ఫోకస్ అయ్యాడు. వార్ 1 లో హ్రితిక్ నెగెటీవ్ రోల్ వేసి హీరో అయ్యాడు. ఇప్పుడు వార్ 2 లో ఎన్టీఆర్ వేసేది అలాంటి కాబట్టి, అసలు హీరోగా తనే హిస్టరీ క్రియేట్ చేస్తే, బాలీవుడ్ బాటలో బాక్సాఫీస్ షేక్ చేసిన తొలి తెలుగు హీరోగా రికార్డు సొంతం చేసుకున్నట్టౌతుంది.