దేవర సినిమా సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సౌత్ లో బాగా ఫేమస్ అయ్యాడు. నార్త్ లో మోస్తరుగా దేవర పర్వాలేదు అనిపించినా… తమిళ, కన్నడలో మాత్రం దేవర సినిమాకు యమా క్రేజ్ వచ్చేసింది. జనాలు ఊగిపోయే రేంజ్ లో సినిమా హిట్ అయింది. దేవరలో ఎన్టీఆర్ లుక్… తమిళ హీరోలకు దగ్గరగానే ఉంటుంది. వాళ్ళ సినిమాలు కూడా దాదాపు అలాగే లుంగీతో ఉంటాయి. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా న్యాచురుల్ మేకింగ్ ఉంటుంది. కమర్షియల్ సినిమాలకు కూడా తమ నేటివిటి మిస్ అవ్వరు అరవ జనాలు.
ఎక్కడికెళ్ళినా సాంబార్ ఉన్నట్టు… సినిమా ఏదైనా లుంగీ కామన్ అన్నట్టు ఉంటుంది. దేవర సినిమాను వాళ్ళు ఓన్ చేసుకోవడానికి రీజన్ అదే మరి. మన తెలుగోళ్ళకు హీరో రంగుల చొక్కా వెయ్యాలి… అడిడాస్ షూ వెయ్యాలనే నాన్సెన్స్ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు కూడా మన జనాలు లుంగీకి అలవాటు పడటంతో… హీరోలు కూడా ఫ్యాంట్ లు తీసి లుంగీలు వేయడం స్టార్ట్ చేసారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇప్పుడు బాగా నచ్చాడు. దేవరలో లుంగీని పైకి కట్టేసీన్ బాగా నచ్చింది అరవ జనాలకు. మాస్ హీరో అంటే… లుంగీ, బీడీనే అనేది వాళ్ళ ఫీల్.
అందుకే ఇప్పుడు తమిళ జనాలు ఎన్టీఆర్ ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ విషయం గమనించిన తమిళ డైరెక్టర్లు ఎన్టీఆర్ కోసం కథలు రాసుకుంటున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పవర్ ఫుల్ కథలను ఎన్టీఆర్ కు చెప్పడానికి ముంబై ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లీ కూడా అలాగే ముంబై వెళ్ళాడని టాక్. ఎన్టీఆర్ కోసం ఓ పవర్ ఫుల్ కథను డైరెక్ట్ గా తమిళంలో చేయడానికి రెడీ అయ్యాడట. దీనికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియదు గాని… ముంబైలో వార్ 2 సెట్స్ కు అట్లీ అయితే వెళ్ళాడు.
ఇప్పటికే వెట్రిమారన్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది తమిళంలో చేసి తెలుగులో డబ్ చేస్తారు. ఎన్టీఆర్ కు ఉన్న మార్కెట్ కు వాయిస్ వింటే చాలు ఆడియన్స్ అన్నట్టు ఉంది కథ. అందుకే ఇప్పుడు తమిళ డైరెక్టర్ లు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ఎన్టీఆర్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా సౌత్ పై ఫోకస్ పెట్టాడు కాబట్టి… కథ నచ్చితే తల నిలువుగా ఊపడం స్టార్ట్ చేసాడు. ఇది తెలిసిన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ నవ్వుతూ ఆకాశాన్ని చూస్తున్నారు.