దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ ను కొందరు చాలా వరకు ట్రోల్ చేసారు. గతంలో ఏ సినిమా విషయంలో ఎన్టీఆర్ ను ఈ రేంజ్ లో ట్రోల్ చేయలేదు. దేవర సినిమా అసలు బాగాలేదు అంటూ మాట్లాడటం, కావాలని సోషల్ మీడియాలో సినిమాను అన్ని విధాలుగా నెగటివ్ టాక్ తో ఇబ్బంది పెట్టడం చేసారు. దీనిపై ఎన్టీఆర్ ముందు నుంచి అసహనంగానే ఉన్నాడు. ఇతర భాషల్లో కూడా కావాలని కొందరితో ట్రోల్ చేయించడం ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డాడు. కొరటాల శివ మీదున్న కోపమా కావాలని ఎన్టీఆర్ ను ట్రోల్ చేసారా అనేది అర్ధం కాని పరిస్థితి.
అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా సినిమాలను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఇతర భాషల డైరెక్టర్లతో సినిమాలను చేయడం వంటివి చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో దేవర ఇచ్చిన బూస్ట్ కూడా గట్టిదే. దీనితో ఇతర భాషల్లో తన మార్కెట్ ఎలా పెంచుకోవాలనే దానిపై తారక్ ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లు ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే వార్ 2 సినిమా కూడా ఎన్టీఆర్ చేతిలో ఉంది.
ఇదే సమయంలో దేవర 2 కూడా ఎన్టీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర 2 ఉండదు అని చాలా మంది కామెంట్ చేసినా కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు తన తర్వాతి సినిమాలకు సంబంధించి జాగ్రత్తలు మొదలుపెట్టాడు. దాదాపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కోసం తన కోసం ఒక మల్టీ లాంగ్వేజ్ పీఆర్ టీంని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. హిందీ, కన్నడ, తమిళంలో కూడా పీఆర్ టీం వర్క్ చేయనుంది.
తన సినిమాలను ప్రమోట్ చేయడంతో పాటుగా ఆ సినిమాలను ట్రోల్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి ఏంటీ అనే దానిపై ఇప్పుడు ఎన్టీఆర్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. హిందీలో పని చేసిన ఒక సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అవసరమైతే భారీగా ఖర్చు చేయడానికి కూడా ఎన్టీఆర్ వెనకడుగు వేయడం లేదు. తన సినిమాల ఫస్ట్ లుక్స్ తో పాటుగా ప్రతీ ఒక్కటి పీఆర్ టీం స్వయంగా విడుదల చేయనుంది. అలాగే ఎన్టీఆర్ చేసే సినిమాలకు సంబంధించి ప్రకటనలు, షూటింగ్ విషయాలు ఆ టీం స్వయంగా బయటపెడుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లేదా బెంగళూరులో ఆఫీస్ ను ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.