యంగ్ టైగరే మ్యాన్ ఆఫ్ మాసెస్.. మరి సూపర్ స్టార్…

పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ కాకున్నా, పదేళ్లుగా పాన్ ఇండియా లెవల్లో , లాంగ్వేజ్ కి బ్యారియర్ లేదని ప్రూవ్ చేసింది తెలుగు సినిమాలే. అలాంటి టాలీవుడ్ లో ప్రజెంట్ ఏ ట్రెండ్ నడిస్తే, అదే ట్రెండ్ దేశ మంతా రీసౌండ్ చేస్తుంది. అలాంటి సౌండే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త ట్యాగ్ మీద పెరిగిపోతోంది.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 09:00 PM IST

పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ కాకున్నా, పదేళ్లుగా పాన్ ఇండియా లెవల్లో , లాంగ్వేజ్ కి బ్యారియర్ లేదని ప్రూవ్ చేసింది తెలుగు సినిమాలే. అలాంటి టాలీవుడ్ లో ప్రజెంట్ ఏ ట్రెండ్ నడిస్తే, అదే ట్రెండ్ దేశ మంతా రీసౌండ్ చేస్తుంది. అలాంటి సౌండే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త ట్యాగ్ మీద పెరిగిపోతోంది. యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్, పాన్ ఇండియా మూవీ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. పుష్ప హిట్ తో స్టైలిష్ స్టార్ కాస్త, ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక త్రిబుల్ ఆర్ తర్వాతే మెగా పవర్ స్టార్ పేరు కాస్త గ్లోబల్ స్టార్ గా మారింది. యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ కూడా రెబల్ స్టార్ గా మరో అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇలా పాన్ ఇండియా లెవల్లో రేంజ్ మారిన ప్రతీ తెలుగు హీరో బిరుదు, సరికొత్తగా వెలిగింది. మరి ఆల్రెడీ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మారిన మహేశ్ బాబు ట్యాగ్ మరేరకంగా మారబోతోంది? రాజమౌళి సినిమా తర్వాత పక్కగా తన ట్యాగ్ ని మార్చేస్తారా? చూసేయండి.

పాన్ ఇండియా మార్కెట్ ని 10 ఏళ్లుగా శాసిస్తోంది టాలీవుడ్. కాబట్టే యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారగానే, దేశవ్యాప్తంగా తనని అదేపేరుతో పిలుస్తున్నారు. మెగా పవర్ స్టార్ గా ఫోకస్ అయిన చరణ్ ని గ్లోబల్ స్టార్ అంటున్నారు. అంతటికీ కారనం పాన్ ఇండియా మూవీలు చేశాక, వాటి సక్సెస్ తో చాలా మంది హీరోల బిరుదులు మారాయి

పుష్ప కి ముందు స్టైలిష్ స్టారైన బన్నీ, పుష్పరాజ్ గా హిట్ మెట్టెక్కగానే ఐకాన్ స్టార్ గా మారాడు. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాతే ఎన్టీఆర్,చరణ్ లా ట్యాగ్స్ మారిపోయాయి. యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్, రెబల్ స్టార్ గా పాన్ ఇండియా సింహాసనంలో కూర్చుున్నాడు. ఇక మిగిలింది సూపర్ స్టార్ మహేశ్ బాబే

తను ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. కాబట్టి తన బిరుదు ఎప్పుడు మారుతుందా అన్న డిస్కర్షన్ రాలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. రాజమౌళి మేకింగ్ లో పాన్ ఇండియానే కాదు, వరల్డ్ మార్కెట్ ని షేక్ చేయబోతున్నాడు. కాబట్టి, పాన్ ఇండియా లేదంటే అంతకుమించి కొత్త మార్కెట్ లోకి వెళుతున్నా, హీరో క్రేజ్ పెరుగుతున్నా, తనకున్న బిరుదు మారాల్సిందే..

బన్నీ,చెర్రీ, తారక్, ప్రభాస్ బిరుదులు ఇలానే మారాయి. కాబట్టి మహేశ్ బాబు కూడా ఇక మీదట సూపర్ స్టార్ నుంచి మరో ట్యాగ్ తో పిలవబడతాడని అంటున్నారు.నిజానికి తనని మొదట్నుంచి ప్రిన్స్ ని పిలుచుకునే వాళ్లు… ప్రిన్స్ ట్యాగ్ నుంచి తనకి సూపర్ స్టార్ ట్యాగ్ వచ్చింది రీసెంట్ గానే. సో ప్రిన్స్ నుంచి ఆల్రెడీ సూపర్ స్టార్ గా మారిన మహేశ్, మళ్లీ కొత్త ట్యాగ్ తో పిలుస్తారా? ఒక వేల కొత్త ట్యాగ్ పెట్టాల్సి వస్తే ఏం పెడతారు? ఈ చర్చ మొదలైంది

ఐతే మాస్ సూపర్ స్టార్ గా తన పాత బిరుదునే, కొత్తగా మార్చాలన్న డిస్కర్షన్ మాత్రం మహేశ్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ లో పెరిగిపోతోంది. రాజమౌలి సినిమాకు ఆ ట్యాగ్ తోనే మహేశ్ టైటిల్ పడుతుందనే ప్రచారం పెరిగింది.