ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవర వచ్చిన ఇన్ని నెలలకు, ఓటీటీ లో సెన్సేషన్ మొదలైన వారం తర్వాత ఇప్పుడు ఓ హిస్టరీ క్రియేట్ అయ్యింది. లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ లో ఎన్టీఆర్ ఒక విషయంలో వాళ్ల తర్వాతీ స్థానం లో నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ బాలయ్య వల్ల కూడా కానిది ఎన్టీఆర్ వల్లైంది. ఆ ఘనత దేవరతోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దక్కింది. ఇది కూడా నిజానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చాకే తేలింది. బేసిగ్గా ఒక గొప్ప విషయం అర్ధం కావాలంటే, ఖచ్చితంగా ఏదో ఒక కంపేరిజన్ వల్లే అది సాధ్యమౌతుంది… గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చాకే దేవర గొప్పతనం బయట పడటానికో రీజన్ ఉంది… అక్కడే చరణ్ కి మిస్ అయ్యింది, ఎన్టీఆర్ కి దక్కింది. ఆ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయంలోతెంతో తేలింది…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏ క్షణాన దేవర మూవీ చేశాడో కాని, కామెంట్లు, ట్రోలింగ్స్ ని తొక్కుకుంటూ వందలకోట్ల వసూళ్లు, యూఎస్, యూకేతో పాటు నార్త్ ఇండియాలో ఊహించనీ రికార్డులు సొంతమయ్యాయి. ఓటీటీటీలో వ్యూవర్ షిప్ తో కూడా దేవర దూకుడు మతిపోగొడుతోంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తనకి ఒకప్పుుడు కలిసి రాని సాహసమే, ఇప్పుడు చరిత్ర స్రుష్టించే సీన్ మార్చేశాడు
కెరీర్ లో అమితాబ్ కి కొన్ని సార్లు, కమల్ హాసన్ కి చాలా సార్లు , రజినీకాంత్ కి అప్పుడప్పుడు కలిసొచ్చినే ఒక సాహసం, ఎన్టీఆర్ ఫేటే మార్చేసింది. అదే తండ్రి కొడుకులుగా హీరో కనిపించటం.. ఒకప్పుడు ఆంధ్రావాలాలో ఇలానే తండ్రి కొడుకుల పాత్రలో సాహసం చేశాడు. అప్పుడు తను మరీ టీనేజర్ అవటంతో, కథ కూడా కనెక్ట్ కాలేదు..
కాని దేవర లెక్కే వేరు. ఇందులో తండ్రిగా తన పాత్ర గంభీరంగానే కాదు, భయంకరంగా కూడా ఉండటంతో, సౌత్ నుంచి నార్త్ వరకు ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కి జనం ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడే ఈ విషయం ఇంత హాట్ టాపిక్ అవటానికి కారణం, రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ రావటమే..
ఇందులో చరణ్ తండ్రిగా, కొడుగ్గా రెండు పాత్రలు వేసినట్టే కనిపిస్తోంది. అన్నాదమ్ములా, తండ్రి కొడుకులా అన్న విషయం టీజర్ తేల్చకున్నా, కంటెంట్ బట్టి తండ్రీ కొడుకులని తేల్చేస్తున్నారు. కాకపోతే దేవరలో తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ వేరియేషన్స్ అదిరాయి.. అక్కడ దేవరని తీసింది తెలుగు దర్శకుడు కొరటాల శివ.. కాని తమిళ్ స్టైల్లో లుంగీ లుక్ లో ఎన్టీఆర్ ని చూపించాడు
ఇక్కడ గేమ్ ఛేంజర్ లో డైరెక్టర్ శంకర్ తమిళ వ్యక్తి. కాని చరణ్ ని తెలుగు పంచ స్టైల్లోచూపించాడు. కాకపోతే తండ్రి, కొడుకు పాత్రలో వేరియేషన్ పెద్దగా కనిపించట్లేదు. ఇక చరణ్ లుక్ లో ఓ తండ్రి తాలూకు గాంభిర్యం రిఫ్లెక్ట్ కావట్లేదు.. అక్కడే ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. దేవరలో తన లుక్ , పాత్రతో పూనకాలు తెచ్చాడు. బేసిగ్గా తండ్రి కొడుకులు లాంటి పాత్రలు ఏ హీరో వేసినా కలిసిరావటం ఓ చరిత్రం… అలా అమితాబ్ కి, కమల్ హాసన్ కి చాలా సార్లు సాధ్యమైంది. రజినీకాంత్, చిరంజీవికి ఒకటి రెండు సార్లే కలిసొచ్చింది.. అలాంటిది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రి కొడుకు పాత్రలో పాన్ ఇండియాని షేక్ చేసిన తొలి హీరోగా చరిత్ర స్రుష్టించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.
అందుకే గేమ్ ఛేంజర్ మూవీకి దేవరతొ చాలా విషయాల్లో పోలికలు పెరిగాయి. మరి పోలికలు ఉన్నట్టు రికార్డులు కూడా వస్తేనే రిజల్ట్ రీసౌండ్ చేస్తుంది.. లేదంటే ఆ పోలికలే పీకమీద కూర్చుని పంచ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.