ఎన్టీఆర్ సర్కిల్లో ఇరుక్కుపోయాడా…? ఏం చేయాలన్నా భయం ఎందుకు

యంగ్ టైగర్ ఎన్టీఆర్” ఈ పేరుకి ఆ వ్యక్తికి ఓ రేంజ్ ఉంది. రాజకీయాల్లో సినీ వర్గాల్లో ఈ పేరు ఒక సంచలనం. చిన్న వయసులోనే రాజకీయ ఉద్దండులను తన ప్రసంగాలతో భయపెట్టిన ఎన్టీఆర్... నందమూరి కుటుంబానికి ఒకానొక సమయంలో సినిమాల్లో వెన్నుముకగా నిలిచాడు.

  • Written By:
  • Publish Date - September 16, 2024 / 08:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్” ఈ పేరుకి ఆ వ్యక్తికి ఓ రేంజ్ ఉంది. రాజకీయాల్లో సినీ వర్గాల్లో ఈ పేరు ఒక సంచలనం. చిన్న వయసులోనే రాజకీయ ఉద్దండులను తన ప్రసంగాలతో భయపెట్టిన ఎన్టీఆర్… నందమూరి కుటుంబానికి ఒకానొక సమయంలో సినిమాల్లో వెన్నుముకగా నిలిచాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు లేనిపోనీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇవి కేవలం తానే తెచ్చిపెట్టుకున్న సమస్యలు. సినిమా విడుదల అవుతుంది అంటే ఫ్యాన్స్ లో సందడి ఉండే స్థాయి నుంచి భయపడే స్థాయికి తెచ్చుకున్నాడు తారక్.

వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. అసలు ఏంటీ, ఏం జరుగుతుంది అనేది గమనిస్తే మీకే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ ను టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇప్పటికీ భుజానికి ఎత్తుకుంటారు అనే మాట వాస్తవం. ఎన్టీఆర్ వేరు టీడీపీ వేరు కాదు అంటారు. కాని ఎన్టీఆర్ వైఖరి మాత్రం అలా ఉండదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో అలా అవమానిస్తే ఎన్టీఆర్ కనీసం పేరు కూడా ఎత్తకుండా ఓ వీడియో విడుదల చేసాడు. కొడాలి నానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎన్టీఆర్ నుంచి స్పందన లేదు. ఎన్టీఆర్ ఆపాలి అనుకుంటే ఆపవచ్చు. కాని ఆపలేదు.

దానితో ఎన్టీఆర్ ను అభిమానించే టీడీపీ కార్యకర్తలకు ఒళ్ళు మండింది. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది అంటే… ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ గ్రూప్స్ లో పెట్టె ఫోటోలను కూడా తీసేసి… అవసరమైతే వాళ్ళను గ్రూప్స్ నుంచి రిమూవ్ చేయడానికి కూడా టీడీపీ కార్యకర్తలు వెనకాడటం లేదు. ఎవడు ఎన్ని మాట్లాడినా ఎన్టీఆర్ టీడీపీకి ఎంత బలం అనేది ఇప్పుడు మాట్లాడటానికి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్హత ఉండదు. కారణం ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండానే టీడీపీ అధికారంలోకి వచ్చింది.

రాజకీయ పార్టీలు ఎక్కడా ఒక దగ్గర ఆగవు. ఎవరి మీద నమ్మకం పెట్టుకుని రాజకీయం చేయవు. ఎన్టీఆర్ దూరమైతే పవన్ ను దగ్గర చేసుకున్నారు. ఎన్టీఆర్ కంటే పవన్ కి ఫాలోయింగ్ ఎక్కువ. టీడీపీకి లాభమే అయింది. లోకేష్ ని ట్రోల్ చేసినా ఆయనేం వెనకడుగు వేయలేదు. భారీ మెజారిటీతో గెలిచారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు మంత్రిగా కేబినేట్ లో ఉన్నారు. ఎన్టీఆర్ కు పార్టీతో విభేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉండకుండా దగ్గర చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ రెండు వైపులా తప్పు ఉంది అనే మాట వింటూనే ఉంటాం.

బహుశా అది నిజమే కావచ్చు… కానీ ప్రజాదరణ ఉన్న రాజకీయ పార్టీతో ఎన్టీఆర్ దూరంగా ఉండకుండా దగ్గరయ్యే ప్రయత్నం చేయాల్సింది. ఎన్టీఆర్ ఆ ప్రయత్నం చేసి ఉంటే… దేవరకు టీడీపీ నుంచి మద్దతు వచ్చేది. ఎన్టీఆర్ ధైర్యంగా మాట్లాడితే ఆయన వెనుక టీడీపీ పక్కాగా నిలబడి ఉండేది. ఇక తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ సినిమాను చూడరు అనే మాట ఉంది. రేవంత్ రెడ్డి అభిమానుల్లో80 శాతం మంది టీడీపీని అభిమానించే వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఎంత వరకు సినిమా చూస్తారో తెలియదు.

సరే అది పక్కన పెడితే… అల్లు అర్జున్ తో స్నేహం… స్నేహం చేయడం సమస్య కాదు… ఇప్పుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో ప్రమోషన్స్ చేయించాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఎక్కడ ట్రోల్ చేస్తారో అనే భయం ఆయనలో ఉంది. అందుకే ఇంటర్వ్యూ చేద్దామని కూడా ఆగిపోయారు. అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద మాటల యుద్దమే జరుగుతుంది. దానికి తోడు కొరటాల శివ మీద మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. ఇది కూడా ఎన్టీఆర్ కు మైనస్ అవుతుంది.

బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ మీద సీరియస్ గానే ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బాలకృష్ణ ఫ్యాన్స్ కు మధ్య పెద్ద మాటల యుద్దమే జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. బాలకృష్ణ కూడా పలు మార్లు నోటి దురుసు వ్యాఖ్యలు పరోక్షంగా చేసారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా దూరమయ్యారు. వైసీపీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను ఎంత ఆదరిస్తారో ఎవరికి తెలియదు. సినిమాకు వచ్చిన ఇబ్బందేం లేదు. కాని సినిమాకు అనుకున్న విధంగా ప్రమోషన్స్ జరగడం లేదనే మాట వాస్తవం.

రామ్ చరణ్ తో ప్రమోషన్స్ చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా చూడరు ఏమో అనే భయం. రామ్ చరణ్ ఎప్పుడు దొరుకుతాడా ట్రోల్ చేద్దాం అని వాళ్ళు కాచుకుని కూర్చున్నారు. ఇలా ఎన్టీఆర్ అన్ని వైపుల నుంచి ఇబ్బందే పడుతున్నారు. దానికి తోడు ఇక్కడి మీడియాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనే మంట మీడియా వర్గాల్లో ఉంది. ఎంతసేపు నార్త్, నార్త్ అని అక్కడే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. సరిగ్గా ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేస్తే టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడానికి ఒక్క గంట చాలు. కాని ఏదీ సరిగా చేయలేని పరిస్థితి.

సినిమాకు సంబంధం లేని సందీప్ రెడ్డి, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ వైఖరి మారాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ వెళ్లి చంద్రబాబుకి విరాళం చెక్ ఇవ్వగానే దేవర సినిమా టికెట్ ధరలు పెరిగాయి. కాబట్టి ఎన్టీఆర్ కొందరిని దూరం చేసుకుని కొందరికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. దేవర సినిమా ప్రమోషన్స్ కి ఎన్టీఆర్ రేంజ్ కి అసలు సంబంధమే లేదు. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ను దగ్గర చేసుకోవడం కంటే పవన్ ను దూరం చేసుకోకుండా ఉండటానికే ప్రాధ్యానత ఇస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.