జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని ఫాన్స్ బలంగా నమ్ముతూ సోషల్ మీడియాలో సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్ తో సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో హిట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అటు విదేశాల్లో ప్రీ బుకింగ్స్ కి భారీగా వసూళ్లు అయ్యాయి. సినిమా విడుదలకు ముందే అలా ఉంటే హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ నుంచి మూడేళ్ళ తర్వాత వస్తున్న చిత్రం కావడం సోలోగా ఆరేళ్ళ తర్వాత సినిమా రావడంతో ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. హిట్ పడితే కచ్చితంగా అందరికి సమాధానం చెప్పవచ్చని భావిస్తున్నారు. త్వరలోనే భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. నిర్మాతలు కూడా ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంచితే దేవర సినిమా చూసి చనిపోతాను సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండి.. అంటూ ఒక క్యాన్సర్ పేషెంట్ నుంచి బయటకు వచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్(19) బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా అతని తల్లి బయటపెట్టారు. తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అని అతనిని దేవర సినిమా విడుదలయ్యే వరకు బతికించమని తల్లి ఆమె కోరింది. కౌశిక్ కు వైద్యం చేయాలంటే రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని.. దాతలు సహాయం చేయాలని ఆమె వేడుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.