పండిత పుత్ర పరమ సు… జాన్వీని ఆడేసుకుంటున్నారుగా

స్టార్ హీరోతో సినిమా అంటే హీరోయిన్ కి మంచి నటన, హైట్, డాన్స్ ఇలా ఎన్నో చూస్తారు. ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమా అంటే ప్రతీ ఒక్కటి భూతద్దంలో పెట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 11, 2024 / 05:48 PM IST

స్టార్ హీరోతో సినిమా అంటే హీరోయిన్ కి మంచి నటన, హైట్, డాన్స్ ఇలా ఎన్నో చూస్తారు. ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమా అంటే ప్రతీ ఒక్కటి భూతద్దంలో పెట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాల్లో హీరోయిన్ అంటే… పోటీ పడి డాన్స్ చేయాలి, అవసరమైతే నటన కూడా అదే రేంజ్ లో ఉండాలి. గత సినిమాల్లో ఎన్టీఆర్ పక్కన కనపడిన ఏ హీరోయిన్ అయినా సరే ఇలాగే నటన, డాన్స్ తో అదరగొట్టేవారు. తమకు రాకపోయినా గ్లామర్ తో నెట్టుకువచ్చేవారు. కాజల్, సమంతా సహా ఎన్టీఆర్ తో చేసిన చాలా మంది హీరోయిన్లు అలాగే ఉండేవారు.

వారి తర్వాత ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్లపై ఇప్పుడు ఫాన్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది. అరవింద సమేత సినిమాలో పూజ హెగ్డే ఫాన్స్ అసలు నచ్చలేదు. ఆమె నవ్వితే, లేదా సీరియస్ గా ఉంటే మాత్రం బాగుంటుంది. దానికి తోడు నటన కూడా అంత గొప్పగా ఉండదు. ఏడిస్తే ఆమెను చూడలేం అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత కనపడలేదు. ఇప్పుడు దేవర వస్తోంది… భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా సోలోగా వస్తోంది.

కాబట్టి హీరోయిన్ పై కూడా ఫాన్స్ కన్ను ఉంటుంది. ప్రేక్షకులు కూడా జడ్జ్ చేయడం మొదలుపెడతారు. ఫాన్స్ సరిపెట్టుకున్నా ప్రేక్షకులు సరిపెట్టుకునే ఛాన్స్ ఉండదు కదా… ఇప్పుడు ఫాన్స్ ని భయపెడుతుంది అదే. ఇప్పటి వరకు వచ్చిన అన్ని లుక్స్ లో ఏ ఒక్క లుక్ లో కూడా హీరోయిన్ స్కిన్ షో తప్పించి… ఎన్టీఆర్ పక్కన నటించే స్థాయిలో కనపడలేదు అంటున్నారు ఫాన్స్. ఏ మాత్రం కూడా ఆమెకు చీర కట్టు సెట్ కాలేదని… ఇంకోరకంగా ట్రై చేసి ఉంటే బాగుండేది అంటున్నారు.

ఏదో హైట్ మ్యాచ్ అవుతుందని ఆమెను సెలెక్ట్ చేసి ఉంటారేమో గాని… అసలు బాలేదు అని రాంగ్ సెలెక్షన్ అని ఫాన్స్ ఏ ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ అంటే వంద సార్లు ఆలోచించి చూడాలని… బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా నీరు గారుస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవికి చీర కట్టు సెట్ అయినంత మాత్రాన ఆమెకు ఎలా సెట్ అవుతుంది అని పండిత పుత్ర అనే సామెత ఊరికే రాలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.