ఏ ముహూర్తంలో దేవర సినిమా మొదలుపెట్టారో గాని నెగటివ్ ప్రచారం మాత్రం గతంలో ఎన్నడు లేని విధంగా జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ జనాల్లో ఓ నెగటివ్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు దేవర రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న సమయంలో జరుగుతున్న ఈ నెగటివ్ ప్రచారం వసూళ్ళ మీద సినిమా ఫలితం మీద ఎక్కడ పడుతుందో అనే ఆందోళన ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది అనే మాట వాస్తవం.
అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఫ్యాన్స్ కూడా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ బాలేదు అనే ప్రచారం నుంచి ప్రేక్షకులను బయటకు తీసుకు రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇది ఇలా ఉంచితే… ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా వాతావరణం మారిపోయింది. విదేశాల్లో ఎన్నారై టీడీపీ గ్రూప్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉండే ఆ పార్టీ కార్యకర్తలు వాట్సాప్ లో గ్రూప్స్ పెట్టుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ గ్రూప్స్ లో ఎన్టీఆర్ ను అభిమానించే టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు.
ఇప్పుడు సినిమా విడుదల కావడంతో దేవర సినిమా గురించిన పోస్టర్ లు, యూట్యూబ్ లింక్ లు పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇతరులకు నచ్చడం లేదు. దీనితో ఆ గ్రూప్స్ లో రచ్చ రచ్చ అవుతోంది. వేరే గ్రూప్స్ పెట్టుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోవాలని, ఎన్టీఆర్ కు టీడీపీకి సంబంధం ఏంటీ అంటూ అక్కడ రిప్లైలు ఇస్తున్నారు. ఇది సినిమా హీరోల గ్రూప్ కాదని కేవలం పార్టీ గ్రూప్ అని… సినిమా ప్రమోషన్ లు మీ వ్యక్తిగత ఖాతాల్లో చేసుకోండి అంటూ కొందరిని గ్రూప్స్ నుంచి కూడా తొలగిస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటాన్ని స్పందించాల్సిన సమయంలో మౌనంగా ఉండటాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు. కొందరు ఒక అడుగు ముందుకు వేసి ట్రోల్ కూడా చేస్తున్నారు.