మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఇంగ్లీష్ నటులు ఫిదా అవుతున్నారు. లాస్ ఏంజెల్స్ లో సింగిల్ షోకే సీట్లోంచి లేచి చప్పట్లు కొట్టారు… అది కూడా అమెరికాలో సెటిలైన ఇండియన్స్ కాదు, పూర్తిగా తెలుగు రాని అమెరికన్స్… ఇది నిజంగా విచిత్రం… బాలీవుడ్ సినిమాల్లో ఏ మూవీ చేయని పని దేవర చేస్తోంది. త్రిబుల్ ఆర్ నాటు నాటు పాటే ఎన్టీఆర్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లినా, అమెరికాలో ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ అమెరికన్స్ కి ప్రివ్యూ పడటమే కాదు, స్టాండింగ్ ఓవియేషన్ దక్కింది. దానికి కారనం అవతార్ 2 మూవీ వల్ల కానిది దేవర వల్ల అయ్యిందట. ఇందులో 45 నిమిషాల అండర్ వాటర్ ఫైట్ సీన్, అందులో లాస్ట్ 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కి అమెరికన్స్ ఫిదా అవుతున్నారట… ఇంతకి అవతార్ టీం చేయలేంది… దేవర టీంఏం చేసింది.
దేవర మూవీ ప్రివ్యూ పడిపోయింది. కాకపోతే కామన్ ఆడియన్స్ కి కాకుండా అమెరికన్స్ ముక్యంగా హాలీవుడ్ స్టార్స్ దేవరకి ఫిదాఅయినట్టున్నారు. లాస్ ఏంజిల్స్ లో ఈజిప్షియన్ థియేటర్స్ లో ఈ సినిమా ప్రివ్యూ పడింది.
అమెరికాలోని లాస్ ఎంజీల్స్ లో జరిగే బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శింపడడ్డ తొలి భారతీయ సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది దేవర. అంతేకాదు ఈ సినిమా ప్రివ్యూ పడ్డాక, చివర్లో మొత్తం సినిమా చూసిన ఆడియన్స్ నిలుచుని ఐదు నిమిషాల వరకు చప్పట్లతో మెచ్చుకున్నారు
ఎక్కువ శాతం హాలీవుడ టెక్నీషియన్స్, స్టార్స్ ఈ సినిమా పివ్యూని చూసినట్టు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ నాటు నాటు సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు కూడా ఓరకంగా దేవర ప్రమోషన్ కి కలిసొచ్చింది.
ఐతే దేవర టీం హాలీవుడ్ మూవీ అవతార్ 2 నే మించే రేంజ్ రిస్క్ చేయటమే అమెరికన్స్ కి బాగా నచ్చినట్టుంది. దేవరలో లాస్ట్ 45 మినట్స్ అండర్ వాటర్ ఫైట్ సీన్ పెట్టాడు కొరటాల శివ.
ఈ సీన్ కోసం 200 గజాల్లో సముద్రం లా కనిపించే ఓ స్విమ్మింగ్ పూల్ సెట్ వేసి, 35 రోజుల పాటు అండర్ వాటర్ సీన్ తీశారట.
అందుకోసం ప్రతీ ఆర్టిస్ట్ కి, ఫైటర్ కి ఆక్సీజన్ సిలండర్స్ వాడారు.. నిజానికి అవతార్ 2 మూవీతో కేవలం 12 మంది ఆర్టిస్ట్ లను మాత్రమే నీటిలోనికి తీసుకెళ్లి అండర్ వాటర్ ఫైట్ సీన్ తీశారు. కాని దేవరలో ఏకంగా 120 మందితో ఇలాంటి భారీ ఫైట్ సీన్ తీయటం, షార్క్ గ్రాఫిక్స్ అదిరిపోవటంతో బియాండ్ ఫెస్టివల్ లో ప్రివ్యూకి హాలీవుడ్ టెక్నీషియన్స్ ఫిదా అయినట్టున్నారు. మొత్తానికి ప్రివ్యూ తర్వాత ఆడియన్స్ నుంచి స్టాండింగ్ ఓవియేషన్ వచ్చింది.