మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బేసిగ్గానే డౌన్ టూ అర్థ్… తనకెంతగా మాస్ లో పాన్ ఇండియాలెవల్లో ఇమేజ్ ఉన్నా, సింపుల్ గా ఉంటాడు. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన తను, దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేయటం ఒక పద్దతి. లేదంటే ఫిల్మ్ టీం సపోర్ట్ చేసినందుకు విష్ చేయటం మరో పద్దతి.. కాని విచిత్రంగా పేరు పేరునా, సినిమాలో నటించిన తోటి స్టార్లకు, టెక్నీషియన్లకు థ్యాంక్స్ చెప్పాడు. ఇందులో ఇంకా విచిత్రం ఏంటంటే సినిమా లో కంటెంట్ ఏముందనేకంటే, ఎన్టీఆర్ ఉన్నాడా లేడా అనేచూశారు పాన్ ఇండియా ఆడియన్స్. అందుకే కొరటాల నుంచి, జాన్వీ కపూర్ వరకు, సైఫ్ ఆలిఖాన్ నుంచి నిర్మాత కళ్యాణ్ రామ్ వరకు అందరి భారం ఎన్టీఆరే మోసాడు. ఒక్కడే దేవరని పాన్ ఇండియా లెవల్లో హిట్ గా నిలబెట్టాడు. ఈలెక్కన అందరు తనకే థ్యాంక్స్ చెప్పాలి… కాని వందకోట్లకో థ్యాంక్స్ లెక్కన ఎన్టీఆర్ చెప్పిన ప్రతీ థ్యాంక్స్ వెనక కోట్లున్నాయి… ఇదేం లెక్క ..? ఈ లెక్క వెనకున్న లాజికేంటి?
దేవర విడుదలైన వెంటనే నెగెటీవ్ టాక్ తెచ్చుకున్న మూవీ. అయినా బాక్సాఫీస్ షేక్ అయ్యింది. 18 రోజుల్లో 510 కోట్ల షేర్ వసూళ్లు 1000కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కామెంట్లు, ట్రోలింగ్స్, బాలీవుడ్ లో మన హీరోలంటే పడని బ్యాచ్ వ్యతిరేక ప్రచారం, యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఎటాక్ ఇవన్నీ దాటుకుని, దేవర బాక్సాఫీస్ దుమ్ముదులిపాడు.
ఇంత కష్టపడి, అంతా తానై తన క్రేజ్ తో, ప్రమోషనల్ స్కిల్స్ తో, పాన్ ఇండియా లెవల్లో ఈవెంట్లతో
దేవరని శిఖరానికి చేర్చాడు. రాజమౌలి శాపాన్ని కూడా జయించాడు. ఇన్ని చేస్తే నిజానికి ఎంటైర్ దేవర టీమే తనకి థ్యాంక్స్ చెప్పాలి.
ఎందుకంటే దేవర పుణ్యమాని 3 కోట్లు తీసుకునే జాన్వీ కపూర్ కి మొదటి పాన్ ఇండియా హిట్ పడింది. 20 కోట్ల వరకు సడన్ గా తన పారితోషికం పెరిగింది. సైఫ్ ఆలీ ఖాన్ కి కూడా ఆదిపురుష్ లో విలన్ గా కలిసిరాంది, దేవరలో విలనిజం వర్కవుట్ అయ్యింది. అలా సౌత్ లో కూడా తనకి మార్కెట్ పెరిగింది. కాబట్టి నటుల్లో ప్రకాశ్ రాజ్ తోసహా సైఫ్ ఆలీఖాన్, జాన్వీ కపూరే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి థ్యాంక్స్ చెప్పాలి
కానిపేరు పేరునా నటుడు శ్రీకాంత్ తో సహా దేవర సక్సెస్ కి కారణమైన, ఈ ప్రయాణంలో భాగమైన నటులుకు థ్యాంక్స్ చెప్పాడు ఎన్టీఆర్. ఇక ఆచార్య ఫ్లాపుతో అడ్రస్ లేకుండాపోయిన కొరటాల శివ అయితే దేవర పోతే షెడ్డుకి వెళ్లిపోవాల్సిందే అన్నారు. అలాంటి తనకి లైఫ్ ఇచ్చాడు ఎన్టీఆర్. తన క్రేజ్ తో దేవరని పాన్ ఇండియా లెవల్లో దూసుకెళ్లేలా చేశాడు. కంటెంట్ కంటే, ఎన్టీఆర్ ప్రెజెన్సే దేవర స్థాయిని పెంచింది.
కాబట్టి ఆచార్య ప్లాపు తో డీలా పడ్డ కొరటాల శివని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చిన ఎన్టీఆర్ కే దర్శకుడు థ్యాంక్స్ చెప్పలి. అలాంటిది డైరెక్టర్ తో పాటు సాబు సిరల్ కి, సినిమాట్రోగ్రాఫర్ రత్నవేల్ కే కాదు, పాటల స్థాయిని తన డాన్స్ తో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లిన తారకే, అనిరుద్ కి థ్యాంక్స్ చెప్పాడు అన్నీంటికి మించి ఫ్యాన్స్ కి పాన్ ఇండియా లెవల్లో మాస్ మీల్స్ పెట్టిన తారక్, ఈ సక్సెస్ కి కారణమైన అభిమానులకకు కూడా థ్యాంక్స్ చెప్పాడు
నిజానికి తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ కొడితే, ఫ్యాన్స్ కంటే ఎక్కువ సంబరపడేవాళ్లుండరు. అలాంటిది వాళ్లకి ఇంత మంచి హిట్ ని, మాస్ ట్రీట్ ని ఇచ్చిన ఎన్టీఆర్, ఫ్యాన్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఒక్కో థ్యాంక్స్ కి వందకోట్లేస్తే వెయ్యికోట్ల థ్యాంక్స్ తో షాక్ ఇచ్చాడు. ఇలా తను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో భారీగా వైరలౌతోంది