45 రోజుల రెస్ట్… తర్వాత 500 కోట్లతో రెండో సునామీ…!

దేవర వెండితెరమీద వేట ఆపడు... బాక్సాఫీస్ లో వసూళ్ల దరువుకి బ్రేక్ లేదు. ఇలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ మీద కనికరం లేదు. హిట్ ఇచ్చిన దర్శకుడిమీద ప్రేమ ఎంత ఉన్న, జాలి మాత్రం అసలే లేదని తేల్చాడు. జాలి పడే సమయం కాదిది... జాలీగా ఎంజయ్ చేసే టైం లేదనంటున్నడు.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 10:28 AM IST

దేవర వెండితెరమీద వేట ఆపడు… బాక్సాఫీస్ లో వసూళ్ల దరువుకి బ్రేక్ లేదు. ఇలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ మీద కనికరం లేదు. హిట్ ఇచ్చిన దర్శకుడిమీద ప్రేమ ఎంత ఉన్న, జాలి మాత్రం అసలే లేదని తేల్చాడు. జాలి పడే సమయం కాదిది… జాలీగా ఎంజయ్ చేసే టైం లేదనంటున్నడు. కొరటాల శివ కి కేవలం అంటే కేవలం 45 రోజుల బ్రేక్ మాత్రమే ఇచ్చాడు ఎన్టీఆర్… ఆ నెలన్నర రోజుల వెకేషన్ ని ఎంజాయ్ చేయమంటూ గిఫ్ట్ కూడా ఇచ్చాడట. కాకపోతే 45 రోజులు వెకేషన్ తర్వాతే ఏంటి? వెంటనే దేవర 2 మొదలౌతుందా? 2027 లేదంటే 2028 లోనే దేవర సీక్వెల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మరి ఈ 45 రోజుల లీవ్ స్టేట్ మెంట్ ఏంటనుకోవాలి? ఇదే సినీ జనాలకు అర్ధం కావట్లేదు. కాని అక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ మనసు మారిందని తెలుస్తోంది. దేవర 2 విషయంలో ఏదో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తోంది.

దేవర హిట్ మాత్ర మేకా బ్లాక్ బస్టర్ అని తేలింది. కాబట్టే మొన్నే సెలబ్రేట్ చేశారు. కేవలం సినిమా టీం మాత్రమే ఈ సెలబ్రేషన్స్ లో సందడి చేసింది. ఫ్యాన్స్ కోసం దసరా తర్వాతే అంటే 1000 కోట్ల వసూల్ల వదరొచ్చాకే భారీ సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తారట. ఫెస్టివల్ వల్ల బిజీ అయిన పోలీసులకి, దసరా తర్వాత కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఆలోగా దేవరకి 1000 కోట్ల పండగొస్తుంది. సో అప్పుడే అసలైన సక్సెస్ సెలబ్రేస్స్ భారీ ఈవెంట్ రూపంలో జరగబోతోంది…

అయితే ఈలోపు ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్ మెంటే వైరలైంది. బ్లాక్ బస్టర్ ఇచ్చాడని లైట్ తీసుకోలేం, కొరటాలకి 45 రోజులే సెలవు దినాలు అనేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అంతే నెలన్నర వెకేషన్ లో ఎంజాయ్ చేసి, తిరిగొచ్చేయాలనేది తారక్ మాట..

సరే కొరటాల శివ నెలన్నర సెలవులు తీసుకుని, దేవర సక్సెస్ ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ఆతర్వాత ఏంటి? దేవర 2 మొదలు పెడతాడా?…….. అవును అదే జరగబోతోంది. మరి వార్ 2, అలానే ప్రశాంత్ నీల్ తో లాంచైన డ్రాగన్ పరిస్థితి ఏంటంటే, దానికొచ్చిన సమస్యలేదు..

ముందు దేవర 2 షూటింగ్ కి ఛాన్స్ ఎంతంటే, 99 శాతం ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేవర షూటింగ్ చేస్తున్నప్పుడే, దేవర 2 తాలూకు కొన్ని గ్రాఫిక్స్ అవసరం ఉన్న సీన్లు తీశారు. ముఖ్యంగా ఫైట్ సీన్లు, అండర్ వాటర్ ఫైట్ సీన్లే 90 నిమిషాల నిడివి వచ్చింది. అందులో కేవలం 30 నిమిషాలే దేవర లో వాడరు. మిగతా 60 నిమిషాల రషెస్ ఫైనల్ కట్ లో కనీసం 25 నిమిషాలు వచ్చే ఛాన్స్ఉందట.

అంటే ఆల్రెడీ దేవర 2 తాలూకు 25 నిమిషాల సినిమా షూటింగ్ జరిగిపోయినట్టే. మిగతా రెండున్నర గంటల కంటెంట్ ని తెరకెక్కించటమే మిగిలి ఉంది. ఆల్రెడీ కథ సిద్దమైంది. కాబట్టి షూటింగ్ మాత్రమే పెండింగ్ అనుకోవాలి. కాకపోతే దేవర ఊహించిన దానికంటే ఎక్కువే వసూల్లు రాబడుతోంది. దూసుకెళుతోంది. కాబట్టి, దేవర 2 లో ఏవైనా అవసరమైన మార్పులకోసం రెండు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నారట

అంటే డిసెంబర్, జనవరి రెండునెలల్లో దేవర 2 స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేసి, ఫిబ్రవరి నుంచి దేవర రెండో సారి బరిలోకి దిగుతాడు… ఫిబ్రవరి మొత్తం కీ సీన్లతో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేసి, ఆతర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ అవుతాడట. ఎలాగూ డిసెంబర్ లోగా హిందీ వార్ 2 లో తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు తారక్. సో చేతిలో డ్రాగన్, దేవర 2 మాత్రమే ఉంటాయి. ఫిబ్రవరిలో దేవర 2 మొదలౌతుంది. మార్చ్ నుంచి డ్రాగన్ షూటింగ్ షురూ అవుతుంది. మొత్తంగా 2027, 2028 లోనే దేవర సీక్వెల్ అన్న పుకార్లకు బ్రేక్ పడబోతోంది.