యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి నటుడి నుంచి ఎంత ఛాన్స్ ఉంటే అంత పిండుకోవాలి. కథలో పట్టున్నా లేకపోయినా స్క్రీన్ పై సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ మ్యానేజ్ చేసేస్తాడు. ఇరగదీసి యాక్షన్ సీన్స్ లేకపోయినా తన మార్క్ నటనతో సినిమాకు ఏ రేంజ్ లో హైప్ తీసుకు రావాలో ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. టాలీవుడ్ ఆ రేంజ్ లో ఎవరూ లేరు అనే మాట వాస్తవం. ఇక తన డాన్స్ తో కూడా సినిమాను ఏ రేంజ్ కు తీసుకుని వెళ్ళాలో ఎన్టీఆర్ కు చాలా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ను గట్టిగా వాడుతున్నాడు.
వార్ 2 సిన్నిమాతో ఎలా అయినా గట్టి హిట్ కొట్టాలని ఎన్టీఆర్ కూడా పట్టుధలగానే ఉన్నాడు. బాలీవుడ్ సినిమాలను తెలుగులో ప్రమోట్ చేసి వసూళ్లు కొట్టాలని అక్కడి నిర్మాతలు కూడా కాస్త వర్కౌట్ మొదలుపెట్టారు. అందుకే ఎన్టీఆర్ లాంటి యాక్టర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ రేంజ్ లో యాక్షన్ చేస్తాడు అనే దానిపైనే తెలుగులో సినిమా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ యాక్షన్ తో భయం కాదు. కథలో ఎన్టీఆర్ రోల్ కు ఎంత మాత్రం వెయిట్ ఉంది అనేదే సినిమా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది.
జై లవకుశ సినిమాలో తనలో నెగటివ్ షెడ్ ను చాలా బాగా చూపించాడు తారక్. ఈ సినిమాలో కూడా అంతకు మించి చూపించాలని రెడీ అవుతున్నాడు. అందుకే ఇప్పుడు అయాన్ ముఖర్జీ కథలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని టాక్. ముందు ఎన్టీఆర్ రోల్ ను హీరో చంపేసేలా క్లైమాక్స్ ప్లాన్ చేసారు. కాని ఎన్టీఆర్ ను చంపేస్తే తెలుగులో సినిమా ఆడే ఛాన్స్ ఉండదు. కచ్చితంగా ఎన్టీఆర్ పాత్ర బ్రతికే ఉండాలి, ఆ పాత్రకు వెయిట్ ఉంటేనే బాలీవుడ్ టార్గెట్ సక్సెస్ అవుతుంది. అలా లేకుండా వాళ్ళు ఏ రేంజ్ లో ఎయిమ్ చేసినా సినిమా ఆడదు.
ఇక ఎన్టీఆర్ తో యాక్షన్ సీన్స్ ను హై లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కు షారుఖ్ ఖాన్ కు మధ్య యాక్షన్ సీన్స్ లో కూడా ఎన్టీఆర్ రేంజ్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. విలన్ పాత్ర ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత హిట్ అవుతుంది సినిమా. అదే ఇప్పుడు ఫాలో అవుతూ ఎన్టీఆర్ ను గట్టిగా వాడుకోవాలని అయాన్ ముఖర్జీ ప్లాన్ చేసేస్తున్నాడు. ఏ మాత్రం తేడా వచ్చినా గోతిలో పడ్డట్టే.