మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దేవర హిట్ తర్వాత పూర్తిగా వార్ 2 షూటింగ్ మీదే ఫోకస్ పెంచాడు. అది పూర్తిచేసే పనిలో ముంబైకే పరిమితమయ్యాడు. అంతవరకు బానే ఉంది. కాని తన స్ట్రాటజీ స్లోగా రివీలయ్యాకే ఎన్టీఆర్ విశ్వముదురనాల్సి వస్తోంది. రాజమౌళి సపోర్ట్ లేకుండానే దేవరగా తానేంటో పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకున్నాడు తారక్. ఇప్పుడు వార్ 2 మూవీలో విలన్ గా నార్త్ మార్కెట్ ని షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. మెల్లిగా సోలోగా తన క్రేజ్, ఇమేజ్ పెంచేసుకునే దారిలోనే వెళుతున్నాడు. అందులో భాగంగానే అందరూ ఫోకస్ చేయని ముహుర్తాలనే ఎంచుకుంటున్నాడు. ఆ ప్లానింగ్ లో భాగంగానే మరో రెండు సినిమాల ముహుర్తాలకు రిలీజ్ డేట్లతో కాలం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. 2026 డ్రాగన్ మూవీ తో పాటు దేవర సీక్వెల్ ని కూడా పర్ఫెక్ట్ ముహుర్తానికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. కనీసీం రెండేళ్లు మూడు సినిమాలతో 6 వేల కోట్లనే టార్గెట్ చేస్తున్న తను, ఆరేంజ్ బిజినెస్ ని సెక్యూర్ కూడా చేశాడు.. అదెలా?
ఎన్టీఆర్ కూల్ గా కనిపిస్తాడు..హైపర్ యాక్టీవ్ గా సెట్లో గడిపేస్తాడు… అలాని తన స్ట్రాటజీ చూస్తే మాత్రం నాలుగు అడుగులు ముందే ఉంటాడు. ఆ విషయం తన మూడు కొత్త సినిమాల రిలీజ్ ప్లానింగ్ చూస్తే అర్ధమైపోతుంది. చాలా వరకు హీరోలు టచ్ చేయడానికి ఇష్టపడని రిలీజ్ డేట్లే తన టార్గెట్ అయ్యాయి. అందులో ఒకటి కలిసొచ్చే అంశం అయితే, రెండు అంతగా ఇంపార్టెన్స్ లేని ముహుర్తాలు… అక్కడే తన ముదురు లెక్కలు షాక్ ఇస్తున్నాయి
ప్రజెంట్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. జనవరి 10 లోగా ఈ సినిమాషూటింగ్ కి ఫిల్మ్ టీం గుమ్మడి కాయ కొట్టడం పక్కా అంటున్నారు. ఇక ఆగస్ట్ 15 కి ఈ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేయబోతున్నాడు తారక్. ఫస్ట్ హిందీ మూవీగా వార్ 2 వస్తుంటే, విలన్ గా కనిపిస్తూ, నార్త్ మార్కెట్ మిద కమాండ్ పెంచుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇక వార్ 2 తర్వాత మూవీ విషయానికొస్తే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు తారక్. తను లేని సీన్లు తీస్తూ ప్రశాంత్ నీల్ ఈ టైం గ్యాప్ ని వాడుకుంటుంటే, ఫిబ్రవరిలో డ్రాగన్ సెట్లో అడుగుపెట్టేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఐతే డ్రాగన్ రిలీజ్ డేట్ ని ఏడాది ముందే ఫిక్స్ చేసిన తారక్, 2026 జనవరి 9కి బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు
2025లో ఇండిపెండెన్స్ డే కి వార్ 2 వస్తుంటే, 2026 సంక్రాంతికి డ్రాగన్ రాక కన్పామ్ అయ్యింది. ఈరెండు ఏం మిగతా స్టార్స్ కి నచ్చనివో, వద్దనుకునే ముహుర్తాలు కావు… అయితే ఆగస్ట్ 15 లాంటి ముహుర్తానికి దేశభక్తిని రక్తి కట్టించే సినిమాలు తప్ప మరే మూవీని అప్పుడు రిలీజ్ చేయాలనుకోరు. వార్ 2 అలాంటి మూవీనే కాబట్టి, అప్పుడొస్తోంది.. అది వార్2 కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
ఇది కాకుండా 2026 సంక్రాంతికి డ్రాగన్ వస్తోందంటే, అదేమైనా ఎవరూ ఇష్టపడని ముహుర్తమా అంటే అదేం కాదు. పొంగల్ కి రెండు మూడు సినిమాలు పోటీ పడటం కామన్. కాని ఏడాది ముందే ఆ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి, తెలుగు, తమిల్, హిందీలో ఆ సీజన్ ని తానే సీజ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే పోటీకి మరే పెద్ద మూవీ రాకుండా ప్రొడ్యూసర్స్ తో మ్యూచువల్ కో ఆర్డినేషన్ ని సెట్ చేశారట.
ఇక అసలైన రిలీజ్ డేట్ 2026 దసరా… బేసిగ్గా దసరాకి మెగా హీరోలకి తప్ప మరే స్టార్స్ కి కూడా బాక్సాఫీస్ లో కాలం కలిసిరాదంటారు. కాని మెగా హీరోలకి కూడా అప్పడప్పుడు దసరాకి పంచ్ పడింది. అందుకే దసరాకు పెద్ద హీరోల మూవీలు రావటం చాలా అరుదు… అలాంటి అకేషన్ నే, దేవర సీక్వెల్ కి ఎంచుకున్నాడు తారక్. రాజమౌలి మూవితో హిట్ కొట్టిన హీరోకి నెక్ట్స్ మూవీ అంటే ఫ్లాపే అన్న సెంటిమెంట్ ని దేవరతో బ్రేక్ చేసిన తను, దేవర 2 తో దసరా సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసే సాహసం చేస్తున్నాడు. ఏం పండగైనా, పెద్ద హీరో సినిమా వస్తే, అది ఏమాత్రం బాగున్నా బాక్సాపీస్ లో పూనకాలు కామన్. సో వార్ 2 ఈజీగా 1000 నుంచి 2000 కోట్లు రాబట్టే రేంజ్ క్రేజ్ ఉన్నమూవీనే.
ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ మూవీ అంటేనే అది మరో సునామీ క్రియేట్ చేసేఛాన్స్ఉంది. కాబట్టి డ్రాగన్ కూడా 1000 కోట్లే కాదు అంతకుమించే రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక పాన్ ఇండియా హిట్ మూవీలకు సీక్వెల్ వస్తే అది మినిమమ్ 1200 కోట్లు, మ్యాగ్జిమమ్ 1800 కోట్లు దాటే ఛాన్స్ ఉందని బాహుబలి 2, పుష్ప2 ప్రూవ్ చేశాయి… కాబట్టి దేవర 2 కూడా ఆరేంజ్ లో దూసకెళ్ళే ఛాన్స్ఉంది. సో ఇలా దుమ్ముదులిపే స్టామినా ఉన్న మూవీలకు, ఆగస్ట్ 15, జనవరి 9, అక్టోబర్ 15 అంటూ కలిసొచ్చే పండగ సీజన్లను సెట్ చేసి, సక్సెస్ ని సెక్యూర్ చేస్తున్నాడు తారక్. మిగతావాల్లంతా కేవలం కొత్త సినిమాలను పలానా సీజన్లకోసం ప్లాన్ చేస్తే, తారక్ మాత్రం రిలీజ్ డేట్లతో సహా ముందే డిసైడ్ అవుతూ ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నాడు.