గాయపడిన దేవర జాగ్రత్త పడుతున్నాడా…? సేపెరేట్ టీం కోసం ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్…?

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నడు లేని విధంగా దేవర నెగటివ్ టాక్ ని ఫేస్ చేసిన మాట అక్షరాలా నిజం. ఎన్టీఆర్ కు బాలకృష్ణ ఫ్యాన్స్ తో విభేదాలు ఉన్నా కూడా వాళ్ళు ఏ రోజు ఎన్టీఆర్ సినిమాలను టార్గెట్ చేసి నెగటివ్ టాక్ ని పెంచే ప్రయత్నం చేయలేదు.

  • Written By:
  • Publish Date - October 1, 2024 / 01:15 PM IST

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నడు లేని విధంగా దేవర నెగటివ్ టాక్ ని ఫేస్ చేసిన మాట అక్షరాలా నిజం. ఎన్టీఆర్ కు బాలకృష్ణ ఫ్యాన్స్ తో విభేదాలు ఉన్నా కూడా వాళ్ళు ఏ రోజు ఎన్టీఆర్ సినిమాలను టార్గెట్ చేసి నెగటివ్ టాక్ ని పెంచే ప్రయత్నం చేయలేదు. కాని కొరటాల శివ విషయంలో మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉండటం, విదేశాల్లో ప్రభాస్ సినిమా రికార్డులను దేవర అధిగమించడం… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఉన్న కోపాన్ని సోషల్ మీడియాలో దేవరపై చూపించడం అన్నీ చాలా వింతగా కొత్తగా అనిపించాయి జనాలకు. అసలు ప్లాన్ ఏంటో అర్ధం కాలేదు.

దేవర సినిమా బాగుంది… జనాలు ఎంత దారుణంగా చెప్పినా సినిమా అయితే లేదు. కాస్తో కాస్తో మైనస్ లు ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా సినిమా అయితే లేదు. అలా అని ఆచార్య సినిమాతో పోల్చే అంత దారుణంగా లేదు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. కాని దేవర సినిమాను మాత్రం కొందరు వదలకుండా ట్రోల్ చేసారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ గుణపాఠం నేర్చుకున్నట్టుగా అర్ధమవుతోంది. ఎవరో మీద కోపం ఉంటే నన్ను టార్గెట్ చేయడం ఏంటీ అనుకున్నాడో ఏమో… కొన్ని ప్లాన్ లు అమలు చేయడానికి సిద్దమవుతున్నాడు.

ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవడం కోసం వేరే భాషల డైరెక్టర్లతో సినిమాలు చేయడం ఒకటి అయితే… సోషల్ మీడియాలో తనకు అంటూ ఒక ప్రత్యేక టీం ని గట్టిగా ఏర్పాటు చేసుకోవాలని భావించడం మరొకటి. నెగటివ్ ప్రచారంపై ఓ కన్నేసి ఉంచి ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇచ్చే విధంగా ఒక టీం ని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్దమవుతున్నాడు. మెగా ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా లేడు. ప్రభాస్ పై కూడా ఎప్పుడూ ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేయలేదు. కాని ఇలా అన్ని వైపుల నుంచి ట్రోల్ చేయడంతో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు పక్కా లెక్కతో దిగుతున్నాడని టాక్.