దేవర హిట్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుని ఊపిరిపీల్చుకునేలా చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడే రాజమౌళి శాపాన్ని జయించాడు. తను మాత్రమే ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. ఇలా జరిగితే, తన సక్సెస్ చూసి రెబల్ స్టార్ ప్రభాస్ సంతోషపడాలి… లేదంటే తన క్లోజ్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దేవర సక్సెస్ చూసి హ్యాపీ గా ఫీల్ అవ్వాలి.. అలా కాకుండా సీన్ లోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చాడు. తను తెగ సంబరపడిపోతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తో హిట్ కొట్టిన ఏ హీరో అయినా, ఆ తర్వాత ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే.. ఇది తన హీరోల సినిమాల తాలూకు బాక్సాఫీస్ మీద రాజమౌళి వేసి శాపం… ఆ శాపాన్నే దేవర సక్సెస్ తో ఎన్టీఆర్ జయించనట్టేనా? దీనికి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎందుకు సంతోషపడుతున్నట్టు… కేవలం స్నేహమే కారణమా? అంతకుమించి ఇంకేదైనా రీజనుందా?
రాజమౌళితో ఏ హీరో అయినా హిట్ మెట్టెక్కితే, ఆతర్వాత కాలు జారి, ఫ్లాపులు ఊబిలో చిక్కుకోవాల్సిందే.. ఇది జక్కన్న కెరీర్ మొదలైనప్పటి నుంచి హీరోలకు తగులుతున్న శాపం. ఇదేదో రాజమౌళి వేసిన శాపం కాదు, హీరోలు చేసిన పాపం కాదు.. అదలా ఓ శాపం లాంటి సెంట్ మెంట్ లా మారిన వ్యవహరం..
విచిత్రం ఏంటంటే దేవరతో ఎన్టీఆర్ రాజమౌళి శాపాన్ని జయించాడు. ఆ పెల్యూర్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. అసలు దేవర మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ లేదు. ఈవెంట్ క్యాన్సిల్ తర్వాత మళ్లీ మరో ఈవెంట్ ప్లాన్ చేయలేదు. అయినా ఆ వసూళ్ల ప్రవాహం నిజంగా విచిత్రం… రివ్యూలు నెగెటీవ్ గా వస్తున్నాయి… ఆచార్య పంచ్ తర్వాత కూడా కొరటాల శివ మారలేదా అంటున్నారు. బాహుబలిని కాపీ కొట్టిన కొరటాల అన్నారు. అయినా వసూళ్లకు బ్రేక్ పడలేదు. పడేలా లేదు. ఎవరెన్ని కామెంట్లు, ట్రోలింగ్ చేసినా, ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా దేవరకి కనెక్ట్ అయ్యారా?
దరి దాపుల్లో సౌత్, నార్త్ లో ఈ రేంజ్ లో పాన్ ఇండియా లెవల్ మూవీలేవి లేవు. డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ ఛేంజర్ వస్తున్నాయి కాబట్టి, అప్పటి వరకు సౌత్, నార్త్ ఇలా పాన్ ఇండియా మొత్తానికి దేవరే దిక్కు. అలా చూసినా దేవర వసూళ్లకి ఎలాంటి ఢోకా ఉండేలా లేదు. ఇక రాజమౌళి శాపం మీద ఫోకస్ చేస్తే, ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఫ్లాప్ ఫేస్ చేశాడు. జక్కన్నతో సింహాద్రి లాంటి హిట్ పడ్డాక వెంటనే ఫెల్యూర్స్ ఫేస్ చేశాడు. యమదొంగ హిట్ తర్వాత కూడా ఇలానే సేమ్ సెంటిమెంట్ అప్లై అయ్యింది
రాజమౌళి పుణ్యామాని విక్రామార్కుడిగా హిట్ మెట్టెక్కిన రవితేజ ఆతర్వాత హిట్ కోసం అరడజన్ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇక చత్ర పతి హిట్ తర్వాత ప్రభాస్ కి అలానే బ్యాడ్ లక్ బాదేసింది. బాహుబలి1, బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంటూ ఒక యావరేజ్, రెండు ఫ్లాపులు పడ్డాకే సలార్, కల్కీ లాంటి హిట్లొచ్చాయి. ఈగ హిట్ తర్వాత నాని కోలుకోడానికి చేయని ప్రయోగం లేదు.
మగధీర హిట్ తర్వాత ఆరెంట్ ఫ్లాప్… అలానే త్రిబుల్ ఆర్ హిట్ తర్వాతవచ్చిన ఆచార్య ప్లాప్.. ఇలా చరణ్ కూడా రాజమౌళి సెంటిమెంట్ కి బలయ్యాయి. ఒక్క ఎన్టీఆరే మూడు సార్లు ఈ సెంటిమెంట్ కి బలయ్యాక, నాలుగో మూవీ త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో హిట్ మెట్టెక్కి రాజమౌలి సెంటి మెంట్ ని బ్రేక్ చేశాడు.. ఇదే సూపర్ స్టార్ మహేశ్ బాబుని సంబర పడేలా ఛేస్తోంది. బేసిగ్గా ఏ సెంటిమెంటైనా శాపంలా వెంటపడితే, దాన్ని ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి. అలా చేస్తే, ఇక ఆ శాపం కంటిన్యూ కాదు… అంటే రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న మహేశ్ బాబు కి ఇక ఏ డోకా లేదు. ఈ సినిమా ఎలాగూ హిట్ అవుతుంది. తర్వాత తను ఏ మూవీ చేసిన ఫ్లాప్ పడుతుందనే కంగారు అక్కర్లేదు. రాజమౌలి సెంటిమెంటల్ శాపాన్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు కాబట్టి, సూపర్ స్టార్ ఫుల్ హాపీ…